బీట్రూట్ పకోడాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి..

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..పకోడాలు ఎంత రుచికరంగా వుంటాయో చెప్పనవసరం లేదు. సాయంత్రం వేళల్లో టీ తాగుతూ స్నాక్స్ గా తినటానికి ఈ పకోడాలు చాలా బాగుంటాయి. ఇక ఈ పకోడాలని మనం ఎంతో రుచికరంగా చేసుకోవచ్చు. ఇక బీట్రూట్ తో కూడా చేసుకోవచ్చు. బీట్రూట్ ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బీట్రూట్ లో వుండే పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుని చేస్తాయి. ఇక ఈ రుచికరమైన బీట్రూట్ పకోడాలను ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...
బీట్రూట్ ‌ పకోడా తయారీకి కావలసిన పదార్ధాలు...
బీట్‌రూట్‌ 2 (మీడియం సైజ్, సన్నగా తురుముకోవాలి),
అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ - 1 టీ స్పూన్‌,
శనగపిండి - 3 టేబుల్‌ స్పూన్లు,
బియ్యప్పిండి - 1 టేబుల్‌ స్పూన్‌,
మొక్కజొన్న పిండి - 1 టేబుల్‌ స్పూన్‌,
కారం - 1 టీ స్పూన్‌,
చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు - 2
కొత్తిమీర తురుము - కొద్దిగా,
ఉప్పు - తగినంత,
నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా
బీట్రూట్ పకోడా తయారు చేయు విధానం తెలుసుకోండి..
ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బీట్‌ రూట్‌ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, కారం, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి గరిటెతో బాగా కలుపుకోవాలి. దాంట్లో తగినంత ఉప్పు, కొత్తిమీర తురుము వేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌ ఆన్‌ చేసుకుని, నూనె బాగా కాగిన తర్వాత ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని.. పకోడాలు వేసుకోవాలి.ఆ తరువాత ఈ వేడి వేడి పకోడాలను తింటూ ఆ రుచిని  ఆస్వాదించండి. ఇవి సాయంత్రం పూట తినటానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. అలాగే మనం తినే ఆహారంలోకి కూడా నంచుకొని తినటానికి చాలా బాగుంటాయి. ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: