ఆరోగ్యవంతమైన ఆకు కూరల సూప్ ఎలా చెయ్యాలో తెలుసుకోండి...
ఆకు కూరల సూప్ తయారికి కావలిసిన పదార్థాలు:
1 - పెద్ద బ్రోకలీ హెడ్, చిన్న ఫ్లోరెట్లలో కత్తిరించాలి
2 - కట్ చేసిన క్యారెట్లు
1 - కట్ చేసిన ఉల్లిపాయ
2 - చిన్నగా తరిగిన వెల్లుల్లి, లవంగాలు
1 కప్పు బచ్చలికూర
1 పెద్ద బంచ్ - తాజా తరిగిన పార్స్లీ
2 కట్ చేసిన సెలెరీ కాండాలు
3 టేబుల్ స్పూన్ల పెరుగు
3 కప్పులు ఉడకబెట్టిన కూరగాయల పులుసు
1 స్పూన్ - ఉప్పు
కొంచెం మిరియాల పొడి
ఆకు కూరల సూప్ తయారు చేసే విధానం:
ఒక పాత్ర తీసుకుని దానిలో క్యారెట్లు, ఉల్లిపాయ, బచ్చలికూర, సెలెరీ కాండాలు, వెల్లుల్లి వేసి ఉడకబెట్టిన కూరగాయల పులుసును కూడా వెయ్యండి.వీటన్నింటిని మొదట మీడియం ఫ్లేమ్ లో కొంచెం సేపు ఉడకబెట్టండి, తరువాత 20 నిమిషాలు లౌ ఫ్లేమ్ లో ఉడకనివ్వండి.ఇందులో బ్రోకలీ వేసి మరో ఐదు నిమిషాలు మరుగనివ్వండి. తరువాత దానిలో పార్స్లీ, ఉప్పు మరియు మిరియాలు వేసి హ్యాండ్ మిక్సర్ ఉపయోగించి క్రీంగా అయ్యే వరకు కలపాలి.తరువాత పెరుగు వేసి బాగా కలపాలి.
అంతే ఆరోగ్యకరమైన సూప్ రెడీ అయ్యింది. ఇలాంటి మరెన్నో ఆరోగ్యవంతమైన కుకింగ్ ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన ఆరోగ్యకరమైన వంటకాలు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...