రుచికరమైన బెల్లం అన్నం ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... మనందరి నోరూరించే జాగరి రైస్, బెల్లం పరమాన్నం ని మనం పండుగలలో, ఇతర విందు కార్యక్రమాల్లో వండుకుంటాం. ఈ రెసిపీని వండిన అన్నం తోనే తయారుచేసుకొని ప్రత్యేకమైన సందర్భాలలో మీ ప్రియమైన వారికి వడ్ఢిచుకోవచ్చు.ఈ తియ్యటి వంటకాన్ని అన్నం, బెల్లం,నెయ్యి మరియు బాదాం పదార్దాలతో చాలా సులువుగా చేసుకోవచ్చు.ఈ రెసిపీ పంజాబ్‌‌లోనూ చాలా ప్రసిద్ధమైనది చెప్పొచ్చు..ఈ డిష్ కి మరింత రుచిని అందించటానికి మీకు ఇష్టమైన నట్స్ ని జతచేసుకోండి.
బెల్లం అన్నం తయారు చెయ్యడానికి కావల్సిన పదార్ధాలు....
ప్రధాన పదార్థం..
150 గ్రాములు ఉడకబెట్టడం బియ్యం
ప్రధాన వంటకానికి...
అవసరాన్ని బట్టి జీడిపప్పు..
అవసరాన్ని బట్టి ముక్కలుగాా కోసిన బాదం..
అవసరాన్ని బట్టి బెల్లం పొడి..
3 టేబుల్ స్పూన్ నెయ్యి...
అవసరాన్ని బట్టి ఆహారంలో జోడించదగిన పచ్చ కర్పూరం...
అవసరాన్ని బట్టి లవంగం...
1 చిటికెడు జాజికాయ...
1 చేతి నిండా తురిమిన టెంకాయ...
అవసరాన్ని బట్టి పొడిగా చేసిన యాలకులు....
అవసరాన్ని బట్టి నీళ్ళు....
అలంకారానికి...
అవసరాన్ని బట్టి నల్ల ఎండు ద్రాక్ష...
బెల్లం అన్నం తయారుచేయు విధానం...
కడాయి తీసుకోని అందులో జాజికాయ మరియు జాపత్రి ఆకులని వేసి పొడిగా వేయించండి.ఒకటి, రెండు నిమిషాల పాటుగా ఈ రెండు పదార్దాలని తక్కువ మంట మీద వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక టీస్పూన్ నెయ్యిని కడాయిలో వేసుకొని బాగా కరగనివ్వాలి తరువాత అందులో నల్ల ద్రాక్ష, నట్స్ ని వేసుకొని తక్కువ మంట మీద అన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకోండి.
ఇంకో కడాని తీసుకోని అందులో నీళ్లు పోసి మరిగించండి. బెల్లం పాకం చేయటానికి మరుగుతున్న నీళ్లలో బెల్లం ని వేసుకొని 2 నుంచి 3 నిముషాలు మరిగించాలి తరువాత బెల్లం నీళ్లలో కలిసిపోయేలా బాగా కలుపుకుంటూ పాకం తయారు చేసుకోండి. బెల్లం పాకం చల్లగా అయ్యాక పాకాన్ని వడకట్టుకోండి.
కడాయిలో ఒక టీస్పూన్ నెయ్యి, లవంగాలు అలాగే బెల్లం పాకాన్ని వేసుకోవాలి. మరుగుతున్న బెల్లం పాకం లో ఉడికించిన అన్నం వేసి 2 నుంచి 3 నిముషాలు అన్ని పదార్దాలను బాగా కలుపుతూ గట్టిపడేంత వరుకు ఉడికించుకోవాలి. అన్ని పదార్దాలను బాగా కలుపుకుంటూ ఉండికించటం వలన పదార్దాలు కడాయి అడుగు భాగంలో అంటకుండా ఉంటాయి. జాజికాయ మరియు జాపత్రి ఆకు వేసుకోవాలి. మిశ్రమం గట్టి పడిన వెంటనే తురిమిన ఏండు కొబ్బరిని వేసి కలుపుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ అయినట్లే.
చిన్న మంట మీద అన్ని పదార్దాలను బాగా ఉడికించుకోవాలి. పచ్చ కర్పూరం తీసుకోని బాగా నలిపి పొడిలాగా చేసుకొని కాలాయిలో వేసుకోండి. ఒకసారి పచ్చ కర్పూరం వేసుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని ఇంక ఉడికించకూడదు.దీనిని వేడిగా గిన్నెలోకి వేసుకొని పైన వేయించిన పెట్టుకున్న నల్ల ద్రాక్ష మరియు నట్స్ ని వేసి గార్నిష్ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: