షుగర్ , బీపిని అదుపులో ఉంచే ఆరోగ్యకరమైన ఈ రెసిపీని ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

Purushottham Vinay

మామిడికాయ అన్నం దీన్ని పొద్దున్న బ్రేక్ ఫాస్ట్  గా తీసుకుంటే చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు వున్నాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధ పడేవారు ఈ మామిడికాయ అన్నాన్ని ని బ్రేక్ ఫాస్ట్ లో ఆహారంగా అలవాటు చేసుకోండి.. మీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే బీపి తో బాధ పడేవారికి కూడా చాలా మంచిది. ఈ బిజీలైఫ్‌లో కొందరికి కనీసం బ్రేక్‌ఫాస్ట్ తినేందుకు కూడా సమయం చిక్కడం లేదు. ఈ నేపథ్యంలో మామిడి కాయ అన్నం ను  చాలా తక్కువ సమయంలోనే తయారు చేసేసుకోవచ్చు. ఇందుకు మీ ఇంట్లో మామిడి పౌడర్  , ఉడకపెట్టిన అన్నం , పోపులు, పల్లీలు అందుబాటులో ఉంటే చాలు కేవలం 10 నిమిషాల్లో మామిడికాయ అన్నం  తయారవుతుంది.  ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో దీన్ని ఎలా చెయ్యాలో తెలుసుకోండి..
కావాల్సిన పదార్ధాలు :
అవసరాన్ని బట్టి పసుపు
1 కప్ ఉడకబెట్టిన బియ్యం
10 పచ్చి మిర్చిలు
1 తురిమిన ముడి మామిడి
1/2 కప్ ముడి వేరుసెనగలు
1 చేతి నిండా కోయబడినవి కొత్తిమీర
1 కప్ తురిమిన టెంకాయ
1 టీ స్పూన్ ఎండబెట్టిన మెంతి ఆకు లేదా కసూరీ మేతీ
అవసరాన్ని బట్టి ఉప్పు
టెంపరింగ్ కోసం
అవసరాన్ని బట్టి అసఫోయ్టెడా
1/2 కప్ రీఫైండ్ ఆయిల్ లేదా సుద్దిచేసిన నూనె
1 టీ స్పూన్ ఆవాల విత్తనాలు
1 టీ స్పూన్ మినపప్పు
అవసరాన్ని బట్టి కరివేపాకు
తయారు చేసే విధానం :
ఒక మిక్సీ జార్‌లో పచ్చి మిర్చి, ఇంగువ, పసుపు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి. బాణలిలో కొద్దిగా నూనెను వేసి వేడి చేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, మినపప్పు, వేరుశనగ పప్పును వేసి 2 నుండి 3 నిమిషాలు వేయించాలి.ఇందులో మిక్సీ జార్‌లో వేసుకున్న పేస్ట్ వేసి, ఆపై కొద్దిగా కరివేపాకు వేసి 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు తరిగిన కొత్తిమీర, మేథి పౌడర్ వేసి, అందులో ఉడికించిన అన్నం, తురిమిన పచ్చి మామిడి తురుమును వేసి బాగా కలపండి. మామిడికాయ పుల్లగా ఉంటే, అందులో ఒక టీస్పూన్ చక్కెరను కూడా కలపొచ్చు (మీకు ఇష్టమైతే).ఇప్పుడు ఇందులో తురిమిన కొబ్బరి, ఉప్పు వేసి అన్ని పదార్థాలను బాగా వేయించండి. రైస్ తయారైన తర్వాత గ్యాస్ స్విచ్ ఆఫ్ చేయండి.ఈ చిత్రాన్నాన్ని పచ్చడితో పాటు, వేడిగా సర్వ్ చేయండి.. ఆనందించండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: