వంటా వార్పు: టేస్టీ టేస్టీ `మ‌సాలా అల‌సంద‌లు`

Kavya Nekkanti

కావాల్సిన ప‌దార్థాలు:
అలసందలు- ఒక కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక టీస్పూను
క‌రివేపాకు- రెండు రెబ్బలు
టమాటా గుజ్జు- ఒక కప్పు

 

గరం మసాలా- ఒక టీస్పూను
ఉప్పు- రుచికి స‌రిప‌డా
ఉల్లిపాయ- ఒకటి

 

పచ్చిమిర్చి- రెండు
పసుపు- కొద్దిగా
కొత్తిమీర- కొద్దిగా
ఎండు మిర్చి- రెండు

 


తయారీ విధానం:
ముందుగా స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక‌ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేగించుకోవాలి. అవి వేగాక అందులో ఉడికించిన అలసందలు, చిటికెడు పసుపు వేసి కాసేపు మ‌గ్గ‌నివ్వాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు , టమాటా గుజ్జు వేసి మరికాసేపు ఉడికించి.. ఉప్పు, కారం, గరం మసాలా వేసి నీళ్ళుపోసి మూతపెట్టి మరో పదినిమిషాలు ఉంచి కూర దగ్గర పడ్డాక స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. 

 

అంతే టేస్టీ టేస్టీ మ‌సాలా అల‌సంద‌లు రెడీ. వేడి వేడి రైస్‌తో దీన్ని తింటే చాలా బాగుంటుంది. అల‌సంద‌లు ఆరోగ్యానికి చాలా మందివి. విడిగా తిన‌లేని వారు ఇలా కూర త‌యారుచేసుకుంటే తింటే బాగా ఇష్ట‌ప‌డ‌తారు. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: