ఆహా..! ఏం రుచి అనిపించే `అల్లం గారెలు`

Kavya Nekkanti

కావాల్సిన పదార్థాలు:
మినప్పప్పు- రెండు కప్పులు
అల్లం ముద్ద- రెండు టీస్పూన్లు
పచ్చిమిర్చి- నాలుగు

 

జీలకర్ర- ఒక టేబుల్ స్పూన్‌
లవంగాలు- రెండు
దాల్చినచెక్క- చిన్న ముక్క
నూనె- డీ ఫ్రైకి సరిపడా

 

మిరియాలు- అర టీస్పూను
ఎండుకొబ్బరి తురుము- ఒక టీస్పూను
ఉప్పు- రుచికి స‌రిప‌డా

 


తయారీ విధానం:
ముందుగా మినప్పప్పుని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నాన‌బెట్టుకోవాలి. మిన‌ప్ప‌ప్పు నానిపోయాక మిక్సీ తీసుకొని అందులో మినప్పప్పు మినహా మిగిలినవన్నీ వేసి బాగా రుబ్బుకోవాలి. తర్వాత అందులోనే మినప్పప్పు కూడా వేసి రుబ్బాలి. ఇలా రుబ్బుకున్న మిశ్రమాన్ని గిన్నెలో తీసి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి క‌డాయి పెట్టుకొని అందులో డీ ఫ్రైకి స‌రిప‌డా నూనె పోసుకోవాలి.

 

ఆ త‌ర్వాత ముందుగా ప‌క్క‌న పెట్టుకున్న పిండిని కొద్దికొద్దిగా తీసుకుని గారెల మాదిరిగా చేసి.. మరిగిన నూనెలో వేయించి తీయాలి. అంతే వేడివేడిగా అల్లం గారెలు రెడీ. వీటిని ఏదైనా చట్నీతో లేదా సోస్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న పిల్ల‌లు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: