ప్రేమను నిరాకరించిందని.. యువకుడు ఏం చేశాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో యువతీ యువకులు మధ్య ప్రేమ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఏకంగా స్కూల్ దశ నుంచి ఎంతోమంది ఇలా ప్రేమ అనే పేరుతో తప్పుదోవ పడుతూ ఉండటం కూడా చూస్తూ  ఉన్నాం. ఇక మరి కొంతమంది ప్రేమ అనే ముసుగు వేసుకొని అవసరాలు తీర్చుకుంటూ ఉన్నారు. ఇంకొన్ని ఘటనల్లో ప్రేమోన్మాధులు రెచ్చిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా నచ్చిన వ్యక్తిని ప్రేమించడం అనేది ప్రతి ఒక్కరి హక్కు. ఇక మనసులో ఉన్న ప్రేమను ఎదుటి వ్యక్తికి వ్యక్తపరిచే హక్కు కూడా ఉంటుంది. కానీ ఎదుటి వ్యక్తి ప్రేమించడం ప్రేమించకపోవడం అనేది వారి అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది.

 ఒకవేళ ప్రేమను వ్యక్తపరచిన సమయంలో ఎదుటి వ్యక్తి ప్రేమను నిరాకరిస్తే దానిని కూడా అంగీకరించాల్సి ఉంటుంది. కానీ ఇటీవల కొంతమంది యువకులు ఇది అంగీకరించడం లేదు. ప్రేమించిన యువతీ తమ ప్రేమను నిరాకరించింది అన్న కారణంతో తాము మనుషులం అన్న విషయాన్ని మరిచిపోయి మృగాలుగా మారిపోతున్నారు. దారుణంగా ఇక దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇలా ప్రేమోన్మాధులు రెచ్చిపోతున్న తీరు ప్రతి ఒక్కరిలో కూడా భయాన్ని కలిగిస్తుంది.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే జరిగింది అని చెప్పాలి. తమ ప్రేమను నిరాకరించిందని ఒక ప్రేమోన్మాది ఏకంగా ప్రేయసిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. బ్లేడుతో గొంతు కోసేందుకు ట్రై చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి లోని ఓ డిగ్రీ కాలేజీలో చోటుచేసుకుంది అని చెప్పాలి. నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు ఒక యువతి ప్రేమించుకున్నారు. అయితే ప్రవీణ్ వ్యక్తిత్వం బాగా లేదని తెలిసిన యువతి ఇక అతన్ని దూరంగా పెట్టడం మొదలుపెట్టింది. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రవీణ్ తనను పెళ్లి చేసుకోవాలని.. లేదంటే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇక ఆ తర్వాత తన వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో ప్రేయసి గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. యువతి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: