మొదటిసారి విమానం ఎక్కి.. బాత్రూంలో అతను చేసిన పనికి అరెస్టయ్యాడు?

praveen
సాధారణంగా విమానం ఎక్కడం అనేది ప్రతి ఒక్క సామాన్యుడికి ఒక చిరకాల కలగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కితే చాలు ఇక అంతకంటే జీవితానికి ఇంకేం కావాలి అనుకునే సామాన్యులు నేటి రోజుల్లో చాలామంది ఉన్నారు. అయితే ఇలా కోరుకున్నట్లుగానే ఓ రోజు ఏకంగా విమానం ఎక్కే ఛాన్స్ వస్తే ఆనందానికి అవధులు ఉండవు. అంతేకాదు మొదటిసారి ఈ విమానం ఎక్కినప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ ని మాటల్లో వర్ణించడం కూడా చాలా కష్టం అని చెప్పాలి.

 అంతేకాదు ఇక విమానంలో ఎలా మెలగాలి అన్న విషయంపై కూడా మొదటిసారి విమానం ఎక్కినప్పుడు ఎవరికీ క్లారిటీ ఉండదు. ఈ క్రమంలోనే కొంతమంది ఎగ్సైట్మెంట్లో వింతగా ప్రవర్తించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక ప్రయాణికుడు మొదటిసారి విమానం ఎక్కి చేసిన పని కాస్త ఇతర ప్రయాణికులకు ఇబ్బందిని కలగజేసింది. దీంతో అతన్ని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఎందుకు ఇలా చేశావు అని పోలీసులు అడిగితే.. అతను చెప్పిన సమాధానం విని ఇక పోలీసులు సైతం నవ్వు ఆపుకోలేకపోయారు అని చెప్పాలి. బెంగళూరు వెళ్లే ఆకాష్ ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది.

 50 బెంగళూరు విమానాశ్రయంలో అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. ఏర్పోర్ట్ లో దిగిగానే ఎయిర్లైన్స్ డ్యూటీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తోటి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లు  ఆరోపించారు. అయితే నిందితుడు రాజస్థాన్లోని మారువార ప్రాంతానికి చెందిన వాడుగా గుర్తించారు. అయితే ఆత్మదాబాదులో ఫ్లైట్ టాయిలెట్లోకి వెళ్లి పొగ తాగినట్లు ఎయిర్లైన్స్ సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అరెస్టు చేసి సెంట్రల్ జైలుకి  తరలించారు. అతన్ని ఎందుకు ఇలా చేశావు అంటూ ప్రశ్నించగా నేను తరచూ  రైల్లో ప్రయాణిస్తుంటాను. అక్కడ బాత్రూంలో ఇలాగే సిగరెట్ తాగుతాను. ఇప్పుడు విమానంలో కూడా ఇదే చేశాను  అని నిందితుడు చెప్పాడు.  దీంతో పోలీసులు సైతం నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: