ఫోన్ మాట్లాడుతూ వచ్చాడు, వెళ్ళాడు.. కానీ మధ్యలో ఏం చేశాడంటే?
అయితే తాను ఇలా షూస్ దొంగలిస్తున్న విషయాన్ని ఎవరు గమనించట్లేదు అనుకున్నాడు. కానీ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఇదంతా రికార్డు కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఇంతకీ వైరల్ గా మారిపోయిన వీడియోలో ఏముందంటే.. ఒక వ్యక్తి ఎంతో హుందాగా ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈ క్రమంలోని అక్కడే ఉన్న ఒక టేబుల్ పై కూర్చున్నాడు. ఫోన్ మాట్లాడే బిజీలో ఉన్నాడులే అని అందరికీ అనిపిస్తుంది.
కానీ ఆ తర్వాతే అతని అసలు స్వరూపం బయటపడుతుంది. ఫోన్ మాట్లాడుతూ మెట్ల మీద కూర్చున్న సదరు వ్యక్తి తెలివితేటలను ప్రదర్శిస్తాడు. అతని పాత చెప్పులను పక్కనపెట్టి పక్కనే ఉన్న బూట్లపై కన్నేసాడు. వాటిని ఎంతో చాకచక్యంగా తీసుకొని అంతే తెలివిగా కాళ్ల మధ్యలో పెట్టుకొని ఇక తన పాత చెప్పులను అక్కడ వదిలేసి కాళ్లకు వేసుకుంటాడు. ఇలా కాళ్లకు వేసుకోవడమే ఆలస్యం అక్కడి నుంచి ఎంతో వేగంగా వెళ్ళిపోతాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోవడంతో.. చోరీ చేయడంలో కూడా అతను హుందాతనం చూపించాడు అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..