ప్రైవేట్ భాగంలో పైపు పెట్టి.. కంప్రెసర్ తో గాలి కొట్టాడు.. చివరికి?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనుషుల్లో విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా కనుమరుకు అయిపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్న మనిషి ఏకంగా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. సాధారణంగా చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొరపాట్లు చేసి కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలుసు.  కానీ పెరిగి పెద్దయిన తర్వాత కూడా అన్నీ తెలిసి పొరపాట్లు చేస్తే.. దానిని పిచ్చి అనాలో వెర్రి అనాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది.

 ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఇద్దరు స్నేహితులు సరదా కోసం చేసిన పని కాస్త ఒకరి ప్రాణం పోయే పరిస్థితిని తీసుకువచ్చింది. విచక్షణ కోల్పోయి ప్రవర్తించిన తీరు చివరికి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏకంగా స్నేహితుడి ప్రైవేట్ భాగంలో కంప్రెసర్ తో గాలి పెట్టి కొట్టాడు మరో స్నేహితుడు. ఇదంతా వారు సరదా కోసమే చేశారు. కానీ చివరికి ఇలా ప్రైవేటు భాగంలో కంప్రెషర్ పెట్టి గాలి కొట్టడంతో మరో స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పాలి. ఈ విషాదకర ఘటన కేరళలో వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

 అసోం కు చెందిన మింటు, సిద్ధార్థ్ పని కోసం కేరళకు వెళ్లారు. అయితే వెళ్ళిన వారు సవ్యంగా పనిచేసుకోకుండా ఇటీవలే ఒక పిచ్చి పని చేశారు. సిద్ధార్థ సరదాగా మింటూ ప్రైవేట్ భాగంలో కంప్రెసర్ పెట్టి గాలి కొట్టాడు. దీంతో మింటూ కడుపు ఒక్కసారిగా ఉబ్బిపోయింది. అయితే దీంతో భయపడిపోయిన సిద్ధార్థ వెంటనే మింటుని ఆసుపత్రికి తరలించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఎందుకంటే అప్పటికే మింటూ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా తాను కేవలం సరదా కోసమే అలా చేశానని ప్రాణాలు తీయాలని అలా చేయలేదు అంటూ పోలీసుల విచారణలో సిద్ధార్థ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: