గుడ్డిగా గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యారు.. చివరికి?

praveen
సాధారణం గా తెలియని ప్రదేశాలకు వెళ్లాలి అనుకున్నప్పుడు ఒకప్పుడు అయితే రోడ్డు గుండా కనిపించిన వ్యక్తులను ఇక దారి అడుగుతూ వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఎవరికీ ఆ అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకున్నారు అంటే చాలు వెళ్లాల్సిన చోటికి నేరుగా వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఎలాంటి రూట్ అయినా సరే గూగుల్ మ్యాప్ లో లభిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవల కాలం లో కొత్త ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు ఎక్కువగా ఇలా జిపిఎస్ మీద ఆధార పడుతూ ఉండడం చూస్తూ ఉన్నాము.

 అయితే కొన్ని కొన్ని సార్లు గూగుల్ మ్యాప్స్ మీద అతిగా ఆధార పడితే అనర్ధాలు జరుగుతాయి అని నిరూపించే ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఎప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటిదే. ఇద్దరు టూరిస్టులు ప్రయాణిస్తున్న కారు చివరికి గూగుల్ మ్యాప్ ని గుడ్డిగా ఫాలో కావడం కారణంగా చివరికి సముద్రంలోకి వెళ్లిపోయింది. ఇంకేముంది ఏకంగా కారు నీటిలో మునిగిపోగా.. అందులో ఉన్న ప్రయాణికులు మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు.

 ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే గడువు ముగిసిన మ్యాపులను డిజిటల్ ప్రొవైడర్లు అప్డేట్ చేయకపోవడం వల్ల.. సిగ్నల్ సమస్యలు ఉన్నా కూడా ఇలాంటి అవంతరాలు ఏర్పడుతూ ఉంటాయట. అయితే టూరిస్టులు  గూగుల్ మ్యాప్ ను గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అంటూ ఈ ఘటన చూసిన తర్వాత ఎంతోమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. భూమి మీద నూకలు బాకీ ఉన్నాయి కాబట్టి ప్రాణాలతో బయటపడ్డారు లేదంటే ఎంత ప్రమాదం జరిగేదో అంటూ ఈ వీడియో చూశాక ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: