వైరల్ : ధూమ్ సినిమాలో కూడా.. ఇలాంటి విన్యాసం చూసి ఉండరు?

praveen
హృతిక్ రోషన్ హీరోగా నటించిన ధూమ్ సినిమాను ప్రేక్షకులు అందరూ కూడా చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలో హీరో చేసే విన్యాసాలు అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. పోలీసులకు చిక్కకుండా ఏకంగా హీరో తప్పించుకునే విధానం అయితే  ప్రేక్షకులు అందరిని కూడా కన్నార్పకుండా చూసేలా చేస్తూ ఉంటుంది. ఇక ఇంతకుమించిన యాక్షన్ సీన్స్ ఇంకెక్కడ ఉండవేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది చూస్తే మాత్రం ధూమ్ సినిమా కూడా ఇక్కడొక యువకుడి విన్యాసం ముందు దిగదుడుపే అన్నది మాత్రం అర్థం అవుతుంది.

 సినిమాల్లో కూడా ఇంత రిస్కీ విన్యాసాలను చూసి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మహారాష్ట్రలోని సినీ ఫక్కిలో ఇటీవల చోరీ జరిగింది.  సినిమాలకు మించిన యాక్షన్ సీక్వెన్స్ లాగా ఒక దొంగ ఏకంగా నడుస్తున్న ట్రక్ నుంచి మేకలను దొంగలించాడు. స్పీడుగా వెళ్తున్న లోడ్ నుంచి చాలా మేకలను రోడ్డుపై పడేస్తూ వెళ్ళాడు. అయితే అతను ఇలా చేస్తున్న సమయంలో ఇక వెనకాలే వస్తున్న మరో కారులో ఉన్న వ్యక్తులు వీడియో తీస్తారు. అయితే అతను ఇలా లారీలో నుంచి ఏకంగా మేకలను కింద పడేస్తున్న సమయంలో.. వెనకాలే ఒక కారు లారీ వేగాన్ని మ్యాచ్ చేస్తూ ముందుకు సాగింది.

 వెనకాల కారులో నుంచి ఈ వీడియో తీస్తున్న వారు మేకలను దొంగలించాడు సరే.. కానీ ఎలా తప్పించుకుంటాడబ్బా అని ఆలోచిస్తున్న సమయంలో ఊహించని పనిచేశాడు. ఏకంగా వేగంగా ట్రక్ నుంచి వెనక్కి దిగేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఇక ఆ ట్రక్కు వేగాన్ని మ్యాచ్ చేస్తూ వెళ్లిన కారు ఆ ట్రక్ వెనకాలకు వెళ్ళింది. దీంతో యువకుడు ఆ కారుపై ఎంచక్కా దిగాడు. ఆ తర్వాత బిందాస్ గా ఎస్కేప్ అయ్యాడు. ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో ఇది చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు. సినిమాల్లో కూడా ఇలాంటిది చూడలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: