సినిమా తరహాలో.. పాము కాటు నుంచి తల్లిని కాపాడిన కూతురు?

praveen
ఇటీవల కాలంలో పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అడవుల్లో ఉండాల్సిన పాములు జనావాసాల్లోకి వస్తూ ఏకంగా ఇళ్లల్లోకి దూరుతూ ఉండడం.. ఇక ఎక్కడో ఒకచోట నక్కి ఉండి ఆ ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులపై దాడి చేయడం లాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. అయితే సరైన సమయంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి పాముకాటుకు గురైన వ్యక్తులకు ఇక వెంటనే ప్రథమ  చికిత్స అందించి ఇక ప్రాణాపాయం నుంచి తప్పిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇక్కడ జరిగిన ఘటన కూడా ఇలాంటి కోవకు చెందినదే. మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం. పాము కాటు వేసిన చోటా నోటితో రక్తాన్ని పీల్చి విషాన్ని బయటకి లాగేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటివి కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయి. రియల్ లైఫ్ లో ఇలా చేస్తే ఏకంగా ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది అని అందరూ చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక కూతురు మాత్రం తల్లిని కాపాడుకునేందుకు ఇంత రిస్క్ చేసింది.

 తన ప్రాణాలను రిస్క్ లో పెట్టి మరి పాము కాటు నుంచి ప్రాణాలు కోల్పోకుండా తల్లిని కాపాడుకుంది కూతురు. కర్ణాటకలోని పుత్తూరు జిల్లా కేయూరు గ్రామానికి చెందిన మమత, సతీష్ దంపతులకు కూతురు శ్యామా ఉంది. కాగా తల్లి మమత మొక్కలకు నీళ్లు పోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అక్కడే నక్కి ఉన్న పాము కాటు వేసింది. అయితే డిగ్రీ చదువుతున్న కూతురు శ్యామ సమయస్పూర్తితో వ్యవహరించింది. విషం శరీరం అంతా వ్యాపించకుండా నోటితో తీసేసింది. ఆ తర్వాత వెంటనే హాస్పిటల్ కు తరలించి ఇక తల్లి ప్రాణాలను కాపాడింది అని చెప్పాలి. ఇక ఆ కూతురు తల్లిని కాపాడుకునేందుకు చేసిన పని గురించి తెలిసి ప్రతి ఒక్కరు హాట్సాఫ్ చెబుతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: