జులాయి సినిమా సీన్ రిపీట్.. కానీ అదొక్కటే తేడా?

praveen
కొన్ని కొన్ని సార్లు సినిమాల్లో కనిపించిన సీన్లే అటు నిజజీవితంలో కూడా నిజం అవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటిది ఏదైనా జరిగిందంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చైన్ స్నాచర్  కథ కాస్త అందరినీ అవాక్కయ్యేలా  చేస్తుంది. జులయి సినిమాలో బ్రహ్మానందం ఏకంగా తన భార్య మెడలోనే చైన్స్ స్నాచింగ్ చేయడం కి సంబంధించి ఒక సీన్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ జులాయి సినిమా సీన్ రిపీట్ చేసే విధంగానే ఒక వ్యక్తి వ్యవహరించాడు. అయితే భార్య మెడలో కాదు అమ్మమ్మ మెడలో గొలుసు దొంగలించాడు.

 ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. దొంగతనాలకు అలవాటు పడిన సదరు వ్యక్తి ఇక ఇంట్లో వ్యక్తులనే టార్గెట్ చేసుకొని చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. చివరికి పోలీసులకు చిక్కి జైలు పాలు అయ్యాడు అని చెప్పాలి. కోనరావుపేట మండలం పల్లిమక్తకు  చెందిన ఒక వృద్ధురాలి మెడలో నుంచి హోలీ పండుగ రోజున గుర్తు తెలియని వ్యక్తులు మూడు తులాల పుస్తెలతాడును తెంచుకుపోయారు. అయితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది సదరు మహిళ. ఈ క్రమంలోనె ఇద్దరు వ్యక్తులపై అనుమానం కూడా వ్యక్తం చేసింది మహిళ.

 కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మల్కాపేట గ్రామానికి చెందిన వృద్ధురాలి మనవడు కరుణాకర్ అతని స్నేహితుడికి గతంలో దొంగతనాలు చేసిన నేరచరిత్ర ఉండడం గురించి తెలుసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనె వారిని అదుపులోకి తీసుకోవాలనుకున్నారూ. అంతేకాకుండా ఇక దొంగతనం జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని గమనించారు. తర్వాత ఇక ఆ ఇద్దరే చోరీ  చేశారు అన్న విషయాన్ని పై ఒక నిర్ధారణకు వచ్చి నిందితులను పట్టుకుని విచారిస్తే అసలు నిజం బయటపడింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: