విషాదం : ప్రాణం తీసిన ఆర్టీసీ బస్సు.. ఏం జరిగిందంటే?

praveen
సాధారణంగా స్టూడెంట్స్ అందరూ కాలేజీలకు వెళ్లడానికి ఎక్కువగా ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఉదయం సమయంలో సాయంత్రం సమయంలో కూడా బస్సులు ఎక్కడ చూసినా స్టూడెంట్స్ తో కిక్కిరిసిపోతూ ఉంటాయి. కనీసం బస్సులో కాలు పెట్టడానికి కూడా ప్లేస్ లేనంతగా నిండిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే చాలామంది స్టూడెంట్స్ ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న సమయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పాలి.

ఎందుకంటే బస్సు లోపల ఎంత ప్లేస్ ఉన్నప్పటికీ ఎంతో మంది విద్యార్థులు ఫుట్ బోర్డింగ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ఫుట్ బోర్డింగ్ చేయడం కారణంగా కొన్ని కొన్ని సార్లు ప్రమాదాల బారిన పడుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాల ద్వారా గాయాల పాలు అవుతూ ఉంటే.. మరి కొన్నిసార్లు ప్రాణాలు పోయే దుస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఇలా విద్యార్థులు ఫుట్ బోర్డింగ్ చేయకూడదని.. అంతేకాకుండా రన్నింగ్ బస్సులో నుంచి దిగకూడదు అంటూ ఎన్నిసార్లు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఎంతో మంది విద్యార్థులు తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి.

 ఇక ఇదిలా ఉంటే.. ఆర్టీసీ బస్సు ఇక్కడ ఒక స్టూడెంట్ ప్రాణం పోవడానికి కారణమైంది. నల్గొండ వాసి అయిన 18 ఏళ్ల సంకీర్తన హైదరాబాద్లోని శ్రేయస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుంది. అయితే ఇటీవలే శుక్రవారం రాత్రి సమయంలో ఎల్బీనగర్ పరిధి వనస్థలిపురం శారద నగర్ కాలనీలోని సమీప బంధువుల దగ్గరకు ద్విచక్ర వాహనంపై ఆమె వెళ్ళింది. అయితే పనామా చౌరస్తా దాటగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిపోయింది. అయితే వెనకనుంచి ఆర్టీసీ బస్సు వస్తుంది. ఈ క్రమంలోనే బస్సు డ్రైవర్ బ్రేక్ వేసినప్పటికీ ఇక అప్పటికే బస్సు వెనుక టైరు సంకీర్తన తలపై నుంచి వెళ్ళింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: