కుక్కలను కాల్చి చంపిన అధికారులు.. ఎందుకంటే?
ఇదిలా ఉంటే కొన్ని ఘటనలు చూసిన తర్వాత కుక్కల మధ్య అటు బంధం బలపడటం ఏమో కానీ శత్రుత్వం మాత్రం మరింత పెరిగిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే కాలంలో ఎన్నో ప్రాంతాల్లో వీధి కుక్కలు సృష్టిస్తున్న వీరంగం అంతా ఇంతా కాదు అని చెప్పాలి. ఏకంగా ఎంతో మందిని గాయపరచడమే కాదు ఇంకా ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. ముఖ్యంగా జంతువు ప్రేమికులందరికీ కోపం తెప్పిస్తుంది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే... ఏకంగా 25 కుక్కలను తుపాకీతో కాల్చి చంపారు అధికారులు.
కుక్కలా కారణంగా ఎనిమిది మంది చనిపోయారట. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని బెగుసరై జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అయితే ఇక కుక్కల కారణంగా ఎనిమిది మంది చనిపోవడమే కాదు 40 మంది గాయపడ్డారట. సమాచారం అందుకున్న అధికారులకు కుక్కలను చంపాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గ్రామస్థుల సహకారంతో రెండు రోజుల వ్యవధిలో 25 కుక్కలను అధికారిక తుపాకీతో కాల్చి చంపినట్లు తెలుస్తుంది. అయితే ఆ ప్రాంతంలో కుక్కల కారణంగా కనీసం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది అన్నది తెలుస్తుంది.