సీసీ కెమెరాలు ఉన్నాయని తెలియక.. పోలీసులు ఏం చేశారంటే?

praveen
ఇటీవల కాలంలో నేరాలను అరికట్టేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇక ఇలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడ ఎలాంటి నేరం జరిగినా కూడా ఇక నిందితులు ఎవరు అన్న విషయం మొత్తం పూర్తిగా సీసీ కెమెరాల్లో రికార్డు అవుతుంది. కాబట్టి ఇక నేరస్థులను పట్టుకోవడం ఎంతో సులభతరం అవుతుంది అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే సిసి కెమెరాల కారణంగా ఇటీవల కాలంలో అటు నేరాలు నియంత్రణ కూడా జరుగుతూ ఉంది అని చెప్పాలి.

 అయితే ఇప్పుడు వరకు నేరాలు జరిగిన సమయంలో ఇక చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజీని గమనించి నిందితులు ఎవరు అన్న విషయాలను తెలుసుకొని వారిని పట్టుకోవడం లాంటివి చేశారు పోలీసులు. కానీ ఏకంగా సీసీ కెమెరాలు ద్వారా పోలీసులు దొరికిపోవడం ఎప్పుడైనా చూసారా. కానీ ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా అక్కడ సీసీ కెమెరాలు  ఉన్నాయా లేవా అన్న విషయాన్ని మరిచిపోయిన పోలీసులు.. చేసిన పని మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాలి.

 బీహార్ లోని బక్రీబజార్ పరిధిలో కమస్తాన్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో ఒక పోలీసు వాహనం స్థానిక కలప వ్యాపారి ఇంటి ముందు ఆగింది. అయితే అక్కడే షాప్ ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి. కానీ అక్కడికి వచ్చిన పోలీసులు మాత్రం ఇది గమనించలేదు. కారులో నుంచి ఒక పోలీస్ అధికారి దిగి వ్యాపారి ఇంటి ముందు ఉన్న కలపను ఎత్తుకు వచ్చి కారు వెనక భాగంలో వేసాడు. మరో పోలీసు అధికారి వాహనంలోనే కూర్చొని ఉంటాడు. అయితే ఇక ఇలా కొన్ని కలప ముక్కలను కారులోకి తెచ్చిపడేస్తాడు పోలీసు అధికారి.  ఆ తర్వాత వెళ్ళిపోతారు. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. అయితే పోలీసులు కేవలం మంట కాచుకునేందుకు మాత్రమే కలపను ఎత్తుకెళ్లి ఉండవచ్చు అని కొంతమంది అంటుంటే ఏది ఏమైనా పోలీసులు ఇలా చేయడం పద్ధతి కాదు అని మరి కొంతమంది అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: