ఫోన్ మాట్లాడితే.. 1040 మంది ప్రాణం పోయింది?

praveen
ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనాలు నడపాలని అటు ట్రాఫిక్ పోలీసులు ఎంతలా మొత్తుకున్న వాహనదారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అన్న విషయం తెలిసిందే. అటు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి భారీగా జరిమాణాలు విధించినప్పటికీ కూడా వాహనదారులు ఎలా ట్రాఫిక్ రూల్స్ తప్పించుకొని పోలీసుల కంటపడకుండా ఉండాలి అని ఆలోచిస్తున్నారు తప్ప.. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలను నివారించాలని మాత్రం ఎవరూ అనుకోవడం లేదు.

 ముఖ్యం గా ఇటీవలే కాలం లో మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతుంది అని చెప్పాలి. అయితే ఇలా ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్న కారణంగా ఎంతో మంది ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ వాహనదారుల తీరు లో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి. ఎంతో మంది మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురై చివరికి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అని చెప్పాలి. ఇలా రోజు రోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే ఇలా ఫోన్ మాట్లాడటమే.. ఏకంగా ఒక వెయ్యి 40 మందిని చంపేసింది అన్నది తెలుస్తుంది.

 ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం 2021 సంవత్సరం లో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కారణం గా 1997 రోడ్డు ప్రమాదాలు జరిగాయట. అయితే ఈ రోడ్డు ప్రమాదాలలో కొంత మంది గాయాల బారిన పడగా ఒక్క వెయ్యి 40 మంది చివరికి ప్రమాదం లో మరణించినట్లు తెలుస్తుంది. అదే సమయం లో సిగ్నల్ జంపింగ్ కారణం గా 555 రోడ్డు యాక్సిడెంట్లు జరగగా ఇందులో 222 మంది మృతి చెందారట. 2021లో మొత్తం నాలుగు లక్షల 12,432 రోడ్డు ప్రమాదాలు జరగకగా.. ఇందులో ఒక్క లక్షల 53,972 మంది మరణించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: