ఫోన్ దొంగలించాడనే అనుమానం.. చివరికి ఏం చేశారో తెలుసా?

praveen
ఇటీవల కాలం లో మనషి క్షణికావేశం లో చేస్తున్న పనులు ఎంతో మందికి ప్రాణహాని కలిగిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ముందు వెనక ఆలోచించకుండా కనీస మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్న తీరు ఇక పక్కవారి ప్రాణాలు పోవడానికి కారణమవుతూ ఉంది అని చెప్పాలి. అక్కడ జరిగింది నిజం గా అబద్ధమా అన్న విషయాన్ని కూడా గ్రహించలేక విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు మనిషి.

 వెరసి నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవ్వాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వెలుగు లోకి వచ్చింది. ఏకంగా ఫోన్ దొంగలించాడు అని ఒక యువకున్ని అనుమానించిన వ్యక్తి కోపం తో విచక్షణ కోల్పోయి అతని రైల్లో నుంచి కిందకి విసిరేశాడు. దీంతో అతని తల స్తంభానికి ఢీకొని ఇక చివరికి అక్కడే మరణించాడు యువకుడు. ఈ ఘటన ఢిల్లీ వెళ్లే అయోధ్య కంటోన్మెంట్ ట్రైన్ లో చోటు చేసుకుంది.

 ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త పోలీసుల చేతికి చిక్కడం తో నిందితుని అరెస్టు చేశారు పోలీసులు. అయోధ్య కంటోన్మెంట్ ఓల్డ్ ఢిల్లీ ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తున్న ఒక మహిళ తన ఫోన్ కనిపించకపోవడం తో కంగారు పడింది . అయితే ఓ యువకుని వద్ద ఫోన్ గుర్తించిన తోటి ప్రయాణికులు అతనిని చుట్టు ముట్టి దాడి చేశారు. అతను చెప్పేది కూడా వినిపించుకోకుండా దారుణం గా చితక బాదుతూ ఇక అదంతా ఫోన్లో వీడియో తీశారూ. క్షమించమని ఎంత ప్రాధేయా పడినా కూడా వినిపించు కోలేదు. అయితే ఒక వ్యక్తి అతడిని భోగి నుంచి విసిరడం తో అతని తల స్తంభాన్ని ఢీకొని అతను అక్కడికక్కడే చని పోయాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వీడియో ఆధారం గా నిందితులను పట్టుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: