అతనో డాక్టర్.. కానీ అర్ధరాత్రి ఫుట్ పాత్ మీద ఇదేం పాడు పని?

praveen
కలికాలంలో డాక్టర్లే మనుషుల ప్రాణాలను రక్షించే ప్రత్యక్ష దైవాలు అని చెబుతూ ఉంటారు పెద్దలు. అయితే కరోనా వైరస్ సమయంలో ఇక పెద్దలు చెప్పేది నిజమే అన్న విషయం మాత్రం నిరూపితం అయింది అని చెప్పాలి. ఇక ఎవరైనా పేషంట్ డాక్టర్ల దగ్గరికి వచ్చారు అంటే చాలు శాయశక్తుల ప్రయత్నించి ఇక వారి ప్రాణాలను నిలబెట్టేందుకు ఎంతో మంది వైద్యులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ కొంతమంది డాక్టర్లు మాత్రం ఎంతో గౌరవమైన వైద్య వృత్తిలో కొనసాగుతూ నీచమైన పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ డాక్టర్ ఇలాంటిదే చేశాడు.

 రాజస్థాన్లోని భరత్ పూర్ కు చెందిన ఒక డాక్టర్ అర్ధరాత్రి రెండున్నర గంటల తర్వాత బైకులపై తన ముగ్గురు స్నేహితులతో కలిసి వచ్చి ఫుట్ పాత్ ల మీద దుప్పట్లు అమ్ముకుంటున్న వ్యాపారి దగ్గర 8 దుప్పట్లు దొంగలించి అక్కడి నుంచి పారారయ్యాడు. అయితే కాసేపటికి నిద్ర నుంచి తేరుకున్న సదరు వ్యాపారి ఇక దుప్పట్లు దొంగలించారు అన్న విషయాన్ని గ్రహించి వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించాడు. అప్రమత్తమైన పోలీసులు ఇక ఆ ప్రాంతం మొత్తం సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న కైలాదేవి నేషనల్ పార్క్ వద్ద నలుగురు యువకులు బైక్ పై వస్తూ ఉండడాన్ని పోలీసులు గమనించారు.

 అయితే లేట్ నైట్ పార్టీకి వెళ్లి ఇక సదరు యువకులు వస్తున్నారేమో అనుకుని భావించారు ఖాకీలు. దీంతో ఇక వారిని చూసి చూడనట్లుగానే వ్యవహరించారు. కానీ ఇక బైక్ పై ఉన్న నలుగురు యువకులు మాత్రం పోలీసులను చూసి కంగారుపడ్డారు. దీంతో పోలీసులకు కూడా అనుమానం వచ్చింది. ఇక వారి చేతుల్లో ఉన్నా కవర్లు కూడా పడేసి పారిపోవడానికి ప్రయత్నించారు నలుగురు యువకులు. కానీ పోలీసులు మాత్రం రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నారు. ఇక వీరిలో ఒకరు మైనర్ కాగా మరో ముగ్గురిలో ఒకరు హోమియోపతి డాక్టర్ శైలేంద్ర అన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: