200 లేక సూసైడ్ చేసుకుంటే.. పోస్టుమార్టం కోసం 9 వేలు?

praveen
ఇటీవల కాలంలో మనిషి జీవితంలోని అన్ని పనులు కూడా డబ్బుతో ముడి పడిపోయాయి అన్న విషయం తెలిసిందే . ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా లంచం ఇవ్వనీదే పని అస్సలు జరగడం లేదు. ఇక లంచం తీసుకున్న తర్వాత కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా మనిషి పుట్టుక దగ్గర నుంచి చావు వరకు కూడా అన్ని విషయాల్లో డబ్బే మొత్తం కంట్రోల్ చేస్తుంది అని చెప్పాలి. ఇక్కడ జరిగిన ఘటన మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఏకంగా రీఛార్జ్ చేసుకోవడానికి రెండు వందల రూపాయలు ఇవ్వలేదు అన్న కారణంతో యువకుడు మనస్థాపం చెంది క్షణికావేషంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

 పోలీసులు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తే ఆసుపత్రి సిబ్బంది మాత్రం పోస్టుమార్టం నిర్వహించేందుకు తొమ్మిది వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడం సంచలనంగా మారిపోయింది. అశ్వరావుపేట మండలం నారాయణ పురానికి చెందిన ఎడవెల్లి సురేందర్ అనే యువకుడు రీఛార్జ్ కోసం కుటుంబ సభ్యులు డబ్బులు ఇవ్వలేదని కారణంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు దగ్గర్లోని అశ్వరావుపేట ఆసుపత్రులో ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిక తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు.

 పోస్టుమార్టం చేసిన తర్వాతనే ఇక సురేందర్ మృతదేహాన్ని అప్పగిస్తాం అంటూ ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. దీంతో ఇక పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి  వెళ్లిన కుటుంబ సభ్యులకు ఊహించిన చేదు అనుభవం ఎదురయింది. ప్రభుత్వాసుపత్రిలో వ్యక్తి మృతదేహానికి పోస్టుమార్టం చేయాలంటే 9000 ఖర్చు అవుతుందని లెక్కలు చెప్పారు సిబ్బంది. దీంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. కూలికి వెళ్తే కానీ పూట గడవని పేదల వద్ద 9000 దోచుకుని చివరికి పోస్టుమార్టం నిర్వహించారు. ఇలా రెండు వందల రూపాయలు లేక చివరికి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటే.. అదే కుటుంబం దగ్గర ఇక ఆసుపత్రి సిబ్బంది 9వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేయడం కాస్త వివాదాస్పదంగా మారింది. స్థానిక వైద్యాధికారులు దీనిపై విచారణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: