పోలీసులు స్టూడెంట్స్ గా మారారు.. ఎందుకో తెలిస్తే షాకే?

praveen
ఇటీవల కాలంలో మెడికల్ కాలేజీలలో ర్యాగింగ్లు ఎక్కువైపోయాయి అన్న విషయం తెలిసిందే. అయితే ర్యాగింగ్ చేయడం చట్టరీత్యా నేరం అని తెలిసినప్పటికీ కూడా ఎంతోమంది విద్యార్థులు రెచ్చిపోయి ర్యాగింగ్ కు పాల్పడుతున్నారు. ఇక ఇటీవల కాలంలో ర్యాగింగ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉండడం చూస్తుంటే.. ఇక ర్యాగింగ్ కి అడ్డు అదుపు లేకుండా పోయింది అన్నది మాత్రం అర్థం అవుతుంది అని చెప్పాలి. అయితే పోలీసులు ఎంతలా నిఘా పెట్టినప్పటికీ అటు ర్యాగింగ్ కు పాల్పడుతున్న విద్యార్థులు మాత్రం వెనకడుగు వేయడం లేదు.

 ఒకవేళ పోలీసులు నిగా పెట్టారు అన్న విషయం తెలిస్తే కొన్నాళ్లపాటు రాగింగ్ చేయకుండా సైలెంట్ గా ఉండిపోవడం ఇక ఆ తర్వాత మళ్లీ రెచ్చిపోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇక ఎవరైనా ఫిర్యాదు చేసినా కూడా సరైన ఆధారాలు లేకుండా ఇక ర్యాగింగ్ చేస్తున్న వారిని అరెస్టులు చేయలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే ఇక ఈ ర్యాగింగ్ కారణంగా ఎంతో మంది విద్యార్థులు బలవుతున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల ర్యాగింగ్ నూ నిర్మూలించేందుకు పోలీసులు సరికొత్త ఆలోచనతో ఎంతోమంది ఆకతాయిలన విద్యార్థులకు షాక్ ఇచ్చారు అని చెప్పాలి.

 మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్న విద్యార్థులను ఇండోర్ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. ఇందుకోసం ఏకంగా సరికొత్తగా ప్లాన్ చేసి విద్యార్థుల వేషంలో 24 ఏళ్ల పోలీస్ అధికారి, నర్సుగా మరో ఇద్దరు మహిళ పోలీసులు కూడా వెళ్లారు. దీంతో వారిని కూడా క్యాంటీన్లో సీనియర్లు ర్యాగింగ్ చేయడానికి ప్రయత్నించగా చివరికి ర్యాగింగ్ చేసిన వారిని అరెస్టు చేశారు. అంతకుముందు విద్యార్థులు చేసిన ర్యాగింగ్ పై ఎలాంటి  ఆధారాలు లేకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కానీ ఇటీవలే చివరికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: