అల్లరి చేస్తున్నాడని.. మేనత్త చేసిన పనికి.. బాలుడు ప్రాణం పోయింది?

praveen
చిన్న పిల్లలు అంటేనే అల్లరి కి కేరాఫ్ అడ్రస్.. అయినా అల్లరి చేయకపోతే వాళ్ళు చిన్న పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి. ఎప్పుడూ అల్లరి చేస్తూ తమకు ఇష్టమైన పనులు చేస్తూ ఇక తల్లిదండ్రులు చేసిన పనులను ఏదో ఒకటి  చెడగొడుతు ఆడుకుంటూ ఉంటారు పిల్లలు.  అయితే కొన్ని కొన్ని సార్లు పిల్లలు చేసే అల్లరి కాస్త ముద్దుగానే  అనిపిస్తూ ఉంటుంది. కానీ మరి కొన్నిసార్లు మాత్రం పిల్లలు చేసే అల్లరి కోపం తెప్పిస్తు  ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కోపం వచ్చినప్పుడు పిల్లలపై కాస్త గట్టిగ అరవడం  లాంటిది కూడా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత మన పిల్లలే కదా అల్లరి చేసింది అని కాస్త సర్దుకుపోతూ ఉంటారు అని చెప్పారు.

 కానీ ఇక్కడ మాత్రం మేనత్త అలా చేయలేదు. అల్లరి చేస్తున్నాడు అనే కారణంతో ఇష్టమొచ్చినట్లు పదేళ్ల మేనల్లుడిని చితకబాదింది.  దీంతో దెబ్బలు తాళలేక  పోయినా ఆ బాలుడు చివరికి మృత్యువాత పడ్డాడు. దీంతో ఇక అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు దూరమయ్యాడు అన్న వార్త విన్న ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. దీంతో అరణ్యరోదనగా విలపించారు. ఘటన ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వైఎస్ఆర్ జిల్లాలోని ఓంశాంతి నగర్ కు చెందిన శివయ్య భాగ్యమ్మ  అనే భార్య భర్తలు జీవనోపాధి కోసం నెల రోజుల క్రితం గల్ఫ్ దేశాలకు వెళ్లారు.

 తమ పదేళ్ళ కుమారుడు అయాన్ ను  మేనత్త ఇంట్లో వదిలి పెట్టారు.  అయితే  బాలుడు  అల్లరి చేస్తున్నాడని మేనత్తకు  ఎంతగానో విసుగొచ్చింది. ఈ క్రమంలోనే అల్లరి చేయవద్దు అంటూ అతని తొడ మీద వాత పెట్టింది. దారుణంగా కొట్టింది.  దీంతో  సదరు బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన బంధువులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ  చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. ఈ విషయం తెలుసుకున్న మేనత్త మామ పరారయ్యారు.  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొడుకు చనిపోయిన విషయం తెలిసిన తల్లిదండ్రుల బోరున విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: