చేపలు పట్టేందుకు వెళ్లి మహిళ అదృశ్యం.. మొసలి కడుపు చీల్చి చూడగా?

praveen
సాధారణంగా నీళ్ళలో ఉండే మొసలి వేటాడే విధానం ఎంత భయంకరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే  నీళ్లలో అసలు కనిపించకుండా ఉండిపోయే మొసలి ఒక్కసారిగా దాడి చేసి ఆహారాన్ని మింగేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇలా ఇటీవలి కాలంలో ఎన్నో ప్రాంతాలలో మొసలి దాడిలో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతుంది అని చెప్పాలి. ఇటీవల ఇలాంటి ఒక భయానక ఘటన వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఏకంగా చేపలు పట్టేందుకు వెళ్లిన ఒక మహిళ అదృశ్యం అయింది. దీంతో ఎంత వెతికినా ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ క్రమంలోనే మొసలి పై అనుమానం వ్యక్తం చేసిన స్థానికులు మొసలిని  పట్టుకుని కడుపును చీల్చి చూడగా అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ ఘటన ఇండోనేషియా లోని నార్త్ కాలిమంటన్ లోని ఒక నదిలో జరిగింది అనేది తెలుస్తుంది. పాతిమా అనే 45 ఏళ్ల మహిళ చేపలు  పట్టేందుకు వీలుగా భారీ ముసలి దాడి చేసి ఆమెను మింగేసింది. అయితే ఇలా ముసలి దాడి చేసిన సమయంలో మహిళ గట్టిగా అరవడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు అందరూ ఇక్కడికి వచ్చేటప్పటికే మొసలి ఆమెని నీళ్ళల్లోకి లాక్కెలింది.

 ఆ తర్వాత ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన గ్రామస్తులు మొసలి ఆచూకీ కోసం సముద్రాన్ని జల్లెడ పట్టారు. ఈ క్రమంలోనే 13 అడుగుల పొడవైన పెద్ద పెద్ద మొసలిని పట్టుకున్నారు. ఆ తర్వాత స్థానిక పోలీసులు ఆ మొసలిని కాల్చి చంపారు. అనంతరం భారీ మొసలి పొట్ట చీల్చి చూడగా మహిళకు సంబంధించిన కొన్ని శరీరభాగాలు దొరికాయి. ముసలి కడుపులో పాతిమ తలతో పాటు ఇతర శరీర భాగాలకు కూడా దొరకాయ్. ఈ ఘటన స్థానికులను కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసింది. చేపలు పట్టడానికి వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: