మద్యం తాగి స్కూల్ కి వచ్చిన లేడీ టీచర్.. ఏం చేసిందో తెలుసా?

praveen
సాధారణంగా తల్లిదండ్రులు తర్వాత ప్రత్యక్ష దైవం గురువు అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జన్మకు అసలైన రూపం.. మంచి నడవడిక  నేర్పించి ఇక జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసేది మాత్రం గురువులే అని చెబుతూ ఉంటారు. నిజంగానే ప్రతి ఒక్కరి జీవితంలో గురువుల పాత్ర ఎంతో కీలకమైనది అని చెప్పాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా గురువులని అమితంగా గౌరవించాడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇటీవల కాలంలో కొంత మంది టీచర్లు వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఏకంగా గౌరవమైన ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చే విధంగా ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఎందుకంటే ఎంతో బాధ్యతాయుతంగా మెలగాల్సిన గురువులు నీచంగా ప్రవర్తిస్తున్నారు. కొంతమంది ఏకంగా సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన విద్యార్థుల పైనే అత్యాచారాలకు పాల్పడుతు ఉంటే మరికొంతమంది దారుణంగా హింసిస్తూ సైకో లాగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇంకొంతమంది మద్యం తాగుతూ పాఠశాలకు వచ్చి నానా రచ్చ చేస్తూ ఉన్నారు. ఇక ఇలాంటివి చూసిన తర్వాత గురువులంటే అటు విద్యార్థులకు కూడా గౌరవం లేకుండా పోతుంది అని చెప్పాలి. ఎవరో ఒకరు చేసిన పనికి అందరికీ చెడ్డ పేరు వస్తుంది.

 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. మహిళా టీచర్ ఫుల్లుగా మద్యం తాగి స్కూల్ కు వచ్చిన ఘటన ఛత్తీస్గఢ్లోని జైపూర్ లో వెలుగులోకి వచ్చింది. విద్యాధికారి సిద్దిక్ తనిఖీలకు వచ్చిన సమయంలో లేడీ టీచర్ జగపతి భగత్ తరగతి గదిలో నేలపై పడుకొని ఉండడం చూసి విద్యాధికారి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అయితే ఆమెకు ఆరోగ్యం బాగోలేక అలా పడుకుంది అనుకున్నాడు. ఇక విద్యార్థులను ఆరా తీయగా టీచర్ మద్యం తాగి వచ్చింది అన్న విషయాన్ని చెప్పారు. అయితే గతంలో కూడా ఆమెపై ఆరోపణలువచ్చాయి అన్న విషయాన్ని గుర్తించిన విద్యాధికారి ఆమెను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: