ఆ పని చేసి.. యజమాని కళ్ళు పోగొట్టిన పని మనిషి?

praveen
ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎంతో నమ్మకస్తులు అనుకున్న వారు చివరికి నట్టేట ముంచుతు మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటివి చూసిన తరవాత సాటి మనుషులను నమ్మాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసింది ఇక్కడ ఒక ప్రబుద్ధురాలు. ఇక వృద్ధురాలికి అండగా ఉంటుంది అనుకుంటే చివరికి వక్ర బుద్ధితో ఆలోచించి యజమానురాలు కళ్ళు పోయేలా చేసింది.

 ఈ ఘటన నాచారం స్నేహపురి కాలనీ లో వెలుగులోకి వచ్చింది.. సిరికొండ హేమావతి అనే 73 ఏళ్ల మహిళ కుమారుడు శశిధర్ లండన్ లో ఉండడంతో ఒంటరిగా ఉంటుంది. ఇక ఇటీవలే శశిధర్ మంచిర్యాల జిల్లా మందమర్రి గ్రామానికి చెందిన భార్గవిని 15 వేల జీతం ఇస్తూ ఇక తన తల్లి బాగోగులు చూసుకోవటానికి నియమించాడు. తన భర్త నుంచి వేరుపడి ఒంటరిగా ఉంటుంది భార్గవి. ఇక జీతం తీసుకుంటూ గత కొన్ని రోజుల నుండి హేమవతికి సపర్యలు చేస్తూ వస్తోంది.

 ఇక ఒకవైపు ఇంట్లో పని చేస్తూనే ఇంట్లో బంగారం నగలు లాకర్లు ఎక్కడ ఉన్నాయి అన్న విషయాలను గ్రహించింది. ఈ క్రమంలోనే ఇటీవల కంటి చుక్కలు అని చెప్పి దానికి బదులుగా బాత్రూం శుభ్రపరిచే హార్పిక్ ద్రావణం అందులో జండూబామ్ కలిపి హేమావతి రెండు కళ్ళలో వేసింది. దీంతో అప్పటి నుంచి కళ్ళు కనిపించకుండా పోయాయి. ఇక ఆ తర్వాత ఆమె కళ్ళు ఇన్ఫెక్షన్ సోకిందని లండన్లో ఉన్న కొడుకుకు కూడా చెప్పింది.

 ఇక ఇలా వృద్ధురాలు కళ్ళు కనిపించక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇక చేతివాటం చూపించింది భార్గవి. ఈ క్రమంలోనే బీరువాలో ఉన్న రెండు గాజులు ఒక బంగారు పచ్చల హారం 40 వేల నగదు దొంగలించి బ్యాగులో పెట్టుకుంది. ఇటీవలే తల్లి పరిస్థితి తెలుసుకున్న ఆమె కుమార్తె ఉష ఆస్పత్రికి తీసుకెళ్లి పరిశీలించగా కంట్లో ఏదో విషప్రయోగం జరిగిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చి ఇంట్లో బీరువాలో చెక్ చేయగా బంగారం కనిపించలేదు. దీంతో భార్గవి పై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు విచారించడంతో అసలు నిజం బయటపడింది ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: