కరాటే కళ్యాణి‌ పై పోలీస్‌ కేసు.. ఎందుకో తెలుసా..?

N ANJANEYULU
సినిమాలు, బుల్లితెర న‌టిగా త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకున్న క‌రాటే క‌ల్యాణి తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4 కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన విష‌యం విధిత‌మే. ఈ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ పై జ‌గద్గిరిగుట్ట పోలీస్‌స్టేష‌న్ కేసు న‌మోదు అయిన‌ది. వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం వంటి అంశాల కార‌ణంగా వార్త‌ల‌లో ఉండే కరాటే క‌ల్యాణి ఈ కేసు కార‌ణంగా మ‌రొక‌సారి వార్త‌ల‌లో  నిలిచారు  క‌ల్యాణి. ఓ హ‌త్య కేసులోని సాక్షాల‌ను క‌ల్యాణి వెల్ల‌డి చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో పోలీసులు క‌ల్యాణిపై కేసు న‌మోదు చేసారు.
కొన్నాళ్ల పాటు సైదాబాద్ ప‌రిధిలోని సింగ‌రేణి కాల‌నీలో ఓ మైన‌ర్ బాలిక హ‌త్య‌కు గురైన‌ది. అయితే ఆ హత్య‌కు సంబంధించిన వివరాల‌ను క‌ల్యాణి వెల్ల‌డించే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్టు  కూడా వార్త‌లు వినిపించాయి. ఆ హ‌త్య‌కు సంబంధించిన ఎల్ల‌మ్మ బండ‌లోని తూటంశెట్టి నితేష్ అనే వ్య‌క్తి రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రైవేటుగా ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదును ప‌రిశీలించిన కోర్టు క‌రాటే క‌ల్యాణిపై కేసు న‌మోదు చేయాల‌ని జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసుల‌ను ఆదేశించడంతో.. కోర్టు తీర్పు మేర‌కు జ‌గ‌ద్గిరి గుట్ట పోలీసులు క‌ల్యాణిపై కేసు న‌మోదు చేసారు.
250కి పైగా చిత్రాల‌లో ప‌లు పాత్ర‌ల‌లో న‌టించి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సీరియ‌ళ్ల‌లో, న‌టిగా క‌ల్యాణి మంచి గుర్తింపును సంపాదించుకున్న‌ది. బిగ్‌బాస్ సీజ‌న్ 4 లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న క‌ల్యాణి రెండో వార‌మే ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన‌ది. ఓ హ‌త్య‌కేసులోని సాక్షాల‌ను క‌ల్యాణి తారుమారు చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసుల‌కు కంప్లైంట్స్ రావ‌డంతో పోలీసులు క‌ల్యాణిపై ఎఫ్ఐఆర్ బుక్ చేసారు. గ‌తంలో మా ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా క‌రాటే క‌ల్యాణిపై ప‌లు పోలీస్ స్టేష‌న్‌ల ప‌రిధిలో కేసులు న‌మోదయ్యాయి. కేవ‌లం క‌ల్యాణి మీద‌నే కాకుండా ఇత‌ర ఆర్టిస్ట్‌ల‌పై కూడా ఆ సంద‌ర్భంలో కేసులు న‌మోద‌య్యాయి. సినీ ప్ర‌ముఖుల మీద త‌రుచూ ఈ మ‌ధ్య కాలంలో ఏదో ఒక సంద‌ర్భంలో పోలీస్ స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోద‌వుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: