పరుగుల రాణి పీటీ ఉషపై కేసు.. ఎందుకోస‌మంటే..?

N ANJANEYULU
భార‌త మాజీ అథ్లెట్‌, స్వ‌ర్ణ‌ప‌త‌క విజేత‌, ప‌రుగుల రాణి పీటీ ఉష‌పై కేర‌ళ పోలీసులు తాజాగా కేసు న‌మోదు చేసారు. అయితే మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేర‌కు ఉష‌పై కేసు న‌మోదు చేసిన‌ట్టు కోజికోడ్ పోలీసులు వెల్ల‌డించారు. ఉష‌తో పాటు మ‌రొక ఆరుగురుపై సెక్ష‌న్ 420 కింద కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిపారు పోలీసులు. ఇంటి నిర్మాణం కోసం కొంత మొత్తాన్ని చెల్లించాను అని.. అయితే హామి ఇచ్చిన గ‌డువులోపు ఇల్లు పూర్తి కాలేదు అని ఫిర్యాదు దారుడు జెమ్మూ ఫిర్యాదు చేసారు.
జెమ్మూ జోసెఫ్ కోజికోడ్ లో 1,012 చ‌ద‌ర‌పు అడుగులు క‌లిగిన ఓ ఫ్లాట్‌ను ఓ బిల్డ‌ర్ నుంచి కొనుగోలు చేసిన‌ది. ఆ ఫ్లాట్ కోసం జోసెఫ్ వాయిదాల రూపంలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం రూ.46 ల‌క్ష‌లు చెల్లించింద‌ని.. అయిన‌ప్ప‌టికీ ఫ్లాట్‌ను బిల్డ‌ర్ జోసెఫ్‌కు అప్ప‌గించ‌లేదు దీంతో ఈ వ్య‌వ‌హారానికి సంబంధించి పీటీ ఉష మ‌ధ్య‌వ‌ర్తిత్వం ద్వారా బిల్డ‌ర్‌కు ఆ మొత్తం డ‌బ్బులు చెల్లించాను అని.. కానీ ఫ్లాట్ ఇవ్వ‌డంలో జాప్యం చేస్తున్నారు అని జోసెఫ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే బిల్డ‌ర్ తో పాటు పీటీ ఉష త‌న‌ను కూడా మోసం చేసింద‌ని జోసెఫ్ ఆరోపించింది. ఈ మేర‌కు జోసెఫ్ వెల్ల‌యిల్ పోలీసుల‌కు ఫిర్యాదును అంద‌జేసారు. ఆమె ఫిర్యాదు స్వీక‌రించిన కోజికోడ్ పోలీసు చీఫ్ ఏవీ జార్జ్‌కు వివ‌ర‌ణాత్మ‌క విచార‌ణ కోసం పంపించారు. ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు ఫిర్యాదుదారు కేర‌ళ రియ‌ల్ ఎస్టేట్ రెగ్యులేట‌రీ అథారిటీకీ కూడా వెళ్లారు. అయిన‌ప్ప‌టికీ.. డ‌బ్బులు చెల్లించ‌క‌పోవ‌డంతో బిల్డ‌ర్ గాని, పీటీ ఉష‌గాని అంగీక‌రించ‌లేదు అని ఫిర్యాదులో పేర్కొన్న‌ది. ఉషతో పాటు మ‌రొక ఆరుగురిపై కూడా ఐపీసీ సెక్ష‌న్ 420 కింద కేసు న‌మోదు చేసుకున్నారు పోలీసులు.
 ఉష‌తో పాటు మ‌రో ఆరుగురుపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు త్వ‌ర‌లోనే విచార‌ణ ప్రారంభిస్తామ‌ని వెల్ల‌డించారు. అదేవిధంగా నిర్మాణ‌దారుల‌పై నిఘా ఉంచే కేర‌ళ రియ‌ల్ ఎస్టేట్ రెగ్యులేట‌రీ అథారిటీ ఆధారంగా చ‌ర్య‌లు తీసుకుంటాం అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: