మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 53 మంది మృతి

N ANJANEYULU
వలసదారులను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రక్కు పాదచారుల రెయిలింగ్ను ఒక్క‌సారిగా అక‌స్మాత్తుగా ఢీకొట్టి బోల్తా పడిన‌ది. ఈ ఘటనలో 53 మంది  దుర్మరణం చెంద‌గా.. మ‌రొక 54 మంది గాయాల‌పాల‌య్యారు. వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత‌ విషమంగా ఉన్న‌దని అధికారులు తెలిపారు.  ఈ ప్రమాదం దక్షిణ మెక్సికోలోని చియాపాస్ స్టేట్లో చోటు చేసుకున్న‌ది.  అతివేగంతో పాటు జ‌నాల‌ను  భారీగా ఎక్కించడం వల్లనే వాహనం నియంత్రణ కోల్పోయి ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.
కొంత వ‌ల‌స‌దారులు అధికారుల కండ్లుగ‌ప్పి అక్ర‌మంగా మెక్సికో మీదుగా అమెరికాలోకి ప్ర‌వేశిస్తూ ఉంటారు. ఇలాంటి త‌రుణంలో అక్ర‌మ ర‌వాణా ఘ‌ట‌న‌లు తరుచూ చోటు చేసుకుంటూ ఉంటాయి. కార్గో ట్ర‌క్కులో వ‌ల‌స‌దారుల‌కు అధిక సంఖ్య‌లో త‌ర‌లిస్తుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో వాహ‌నంలో దాదాపుగా107 మంది ఉన్న‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. ప్ర‌మాదంపై స‌మాచారం అందుకున్న స‌హాయ‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయక చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. ప్ర‌మాదం చోటు చేసుకున్న స‌మ‌యంలో వాహ‌నం బోల్తా ప‌డ‌డంతో 53 మంది అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే చికిత్స అందించేంద‌కు ఆసుప‌త్రిల‌కు త‌ర‌లించారు. మృతుల కుటుంబాలకు ఆ  రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం ప్ర‌క‌టించారు. ఈ ప్రమాదానికి కారణం ఎవరనే విషయంపై దర్యాప్తు చేప‌డుతున్నట్టు వెల్ల‌డించారు.
బాధితులంతా మధ్య అమెరికన్లుగా తెలుస్తున్న‌ది. అయితే.. కచ్చితంగా వారు ఏ దేశానికి చెందినవారనేది మాత్రం ఇంకా అధికారులు ధ్రువీకరించలేదు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ కొంతమంది తాము గ్వాటెమాలా దేశస్థులమని  పేర్కొన్న‌ట్టు మాన్యూయెల్ మోరెనో వెల్ల‌డించారు. ట్రక్కు సామర్థ్యానికి మించి జనం ప్రయాణించడం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్న‌ట్టు భావిస్తున్నాం అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై గ్వాటెమాలా అధ్యక్షుడు అలెజాండ్రో గియామ్మట్టే ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేసారు. అదేవిధంగా బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపి.. బాధితులను స్వదేశానికి తరలించడం సహా తగిన సహాయం తాము చేస్తామని ప్రకటించారు మాన్యూయెల్ మోరెనో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: