రాజు ఆత్మ‌హ‌త్య.. సింగ‌రేణి కాల‌నీలో సంబురాలు.. !

MADDIBOINA AJAY KUMAR
సింగ‌రేణి కాల‌నీలో ఆరేళ్ల చిన్నారి పై హ‌త్యాచారం చేసిన నింధితుడు రాజు అత్మ‌హ‌త్య చేసున్నాడు అనే వార్త తెలియ‌డంతో సింగ‌రేణి కాల‌నీ సంబురాలు జ‌రుపుకుంటున్నారు. చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసి చంపిన ఆ మాన‌వ మృగం ఇక లేద‌ని కాల‌నీ వాసులంతా క‌లిసి ట‌పాసులు పేల్చుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు. అయితే నింధితుడి డెడ్ బాడీని పాప త‌ల్లి దండ్రుల‌కు చూపిస్తే వారు ఇంకా ఆనందిస్తార‌ని కాల‌నీ వాసులు చెబుతున్నారు. మ‌రోవైపు పాప తండ్రి కూడా ఆ హంత‌కుడి బాడీ సింగ‌రేణి కాల‌నీకి తీసుకురావాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. ఇక హంత‌కుడిని ప‌ట్టుకోవ‌డ‌గాని పోలీసులు ఇన్ని రోజులు చేస్తున్నార‌ని మొద‌ట తాము బాధ‌ప‌డ్డామ‌ని కాల‌నీవాసులు చెబుతున్నారు. 

పోస్ట్ మార్టం త‌ర‌వాత అయినా రాజు డెడ్ బాడీని తీసుకురావాల‌ని కాల‌నీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఎట్ట‌కేల‌కు ఆ మృగాడు చ‌నిపోయాడ‌ని తాము ఆనందంగా ఉన్నామని చెబుతున్నారు. ఇక ఈ దారుణం జ‌రిగిన నాటి నుండి దిశ కేసులో న్యాయం చేసిన ప్ర‌భుత్వం అలాంటి న్యాయ‌మే మాకు ఎందుకు చేయ‌డం లేద‌ని కుటుంబం ముందు నుండి ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంది. త‌మ‌కు కూడా అలాంటి న్యాయ‌మే కావాల‌ని ఆస్తులు పాస్తులు వ‌ద్దని బాధితురాలి కుటుంబం ఆవేద‌న వ్య‌క్తం చేసింది. బాధితుల‌ను ఎవ‌రు ప‌రామ‌ర్శించేందుకు వెళ్లినా కూడా త‌మ కూతురుని కిరాతకంగా హ‌త మార్చిన నింధితుడు బ‌తికి ఉండ‌కూడ‌ద‌ని వారి చావే త‌మ‌కు న్యాయం అని పాప ఆత్మ‌కు శాంతి అని బాధిత కుటుంబం ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

ఇక ఈ రోజు వారికి వారు కోరుకున్న‌ట్టుగానే న్యాయం జ‌రిగింది. ఇదిలా ఉండ‌గా రాజు మృత దేహాన్ని ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా అక్క‌డ‌కు చేరుకున్న అంబులెన్స్ పై చెప్పుల తో దాడి చేశారు. రాజు మృత దేహం ఉన్న అంబులెన్స్ పై చెప్పులు విసిరి అత‌డినే కొట్టిన‌ట్టు ప్ర‌జ‌లు భావించారు. మార్చురీ వ‌ద్ద పోలీసులు ఆప‌లేనంత‌గా స్థానికులు చేరుకుని చెప్పులతో విస‌ర‌డంతో ఆందోళ‌న‌క‌రంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: