నిందితుడు రాజు ది హత్యా.. ఆత్మహత్యా..?

MADDIBOINA AJAY KUMAR
సైదాబాద్ సింగ‌రేణి కాల‌నీలో చిన్నారి అత్యాచారం, హత్యకేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్న‌ట్టు  అత‌డి డెడ్ బాడీ వ‌రంగ‌ల్ జిల్లా స్టేష‌న్ ఘ‌న్ పూర్ రైల్వే స్టేష‌న్ వ‌ద్ద ట్రాక్ పై క‌నింపిచిన‌ట్టు పోలీసులు వెల్ల‌డ‌లించారు. ప్యాసింజ‌ర్ రైలు వ‌స్తుండ‌గా ఉద‌యం 9 గంట‌ల 45 నిమిసాషాల స‌మ‌యంలో రాజు ప్ర‌యానిస్తున్న రైలు కింద ప‌డిపోయిన‌ట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే నింధితుడి ఆత్మ‌హ‌త్య‌పై స‌ర్వ‌త్రా అనుమానాలు వ‌స్తున్నాయి. సాధారణంగా రైలు కింద పడిన వాళ్ల శ‌రీర భాగాలు విడిపోతాయి. రైలు వేగానికి శ‌రీర భాగాలు చింద‌ర మంద‌ర అవుతాయి. కానీ రాజు మృత దేహం పై కేవ‌లం త‌లకు త‌ప్ప మిగితా భాగాల్లో ఎక్క‌డా గాయాలు క‌నిపించ‌కపోవ‌డం అనుమానాలకు దారి తీస్తోంది. 

మరోవైపు మొద‌ట కేటీఆర్ నింధితుడు రాజు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారంటూ ట్వీట్ చేయ‌డం ఆ త‌ర‌వాత తప్పుడు స‌మాచారం అందింది అంటూ మ‌రో ట్వీట్ చేయ‌డం కూడా అనుమానాల‌కు దారితీస్తోంది. పోలీసులు ముందుగానే రాజును అరెస్ట్ చేశార‌ని..అయితే నింధితుడు అదుపులో ఉన్నాడ‌ని తెలిస్తే బాధిత కుటుంబ స‌భ్యులు మ‌రియు ప్ర‌తిప‌క్షాలు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చేసే అవ‌కాశం ఉందని రాజు అదుపులో ఉన్న విష‌యాన్ని గోప్యంగా ఉంచిన‌ట్టు కూడా ప‌లువురు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా సాక్షాత్తూ మంత్రి మ‌ల్లా రెడ్డి మాట్లాడుతూ నింధితుడిని ఎన్ కౌంట‌ర్ చేస్తామ‌ని బ‌హిరంగంగా చెప్పాడు. ఈ నేప‌థ్యంనే పోలీసులు కూడా బుల్లెట్ పేల్చ‌కుండా ఎన్ కౌంట‌ర్ చేశారంటూ అనుమానాలు త‌లెత్తుతున్నాయి.   బాధితురాలి తండ్రి రాజును పోలీసులే హ‌త్య చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు కూడా చేశాడు. నింధితుడి మృత దేహాన్ని సింగ‌రేణి కాల‌నీకి తీసుకురావంటూ చైత్ర తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. ఏది ఐమైనా చిన్నారి చైత్ర‌కు దుర్మార్గుడి మ‌ర‌ణంతో అంతో ఇంతో న్యాయం జ‌రింగింది. చైత్ర కుటుంబం కోరుకున్న‌ట్టుగా ఆ మాన‌వ మృగం ఇక లేదు. మాకు ఆస్తులు వ‌ద్దు డ‌బ్బులు వ‌ద్ద‌ని చెప్పిన ఆ కుంటుంబం ఎనిమిది రోజులుగా ఎంత న‌ర‌క‌యాత‌న అనుబ‌విస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: