పులిహార అంటే ఇలా ఉండాలి.. !!

Suma Kallamadi
పులిహోర అంటే ఇష్టపడని వారు ఎవరు ఉంటారు చెప్పండి. ఇంట్లో చేసే పులిహార కంటే గుళ్ళల్లో చేసే ప్రసాదం పులిహార అంటే అందరు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు.అయితే కొంతమందికి మాత్రం పులిహార చేయడం అసలు రాదు. ఒకసారి ఇండియా హెరాల్డ్ వారు చెప్పే పులిహారను ఇలా చేసి చూడండి. ఎంతో రుచి కరంగా ఉంటుంది.
కావాల్సిన పదార్ధాలు:
250 gms బియ్యం
1/4 cup నూనె
2 రెబ్బలు కరివేపాకు
3 పచ్చిమిర్చి
1 tsp పసుపు
ఉప్పు
50 gms చింత పండు
1/2 tsp ఆవాలు
1 tsp మెంతులు
1 కరివేపాకు
1/2 tsp ఇంగువ
1/2 tsp ఆవాలు
1/4 cup వేరు సెనగ పప్పు
5 ఎండు మిర్చి
జీల కర్ర -కొద్దిగా
సాయి మినప పప్పు -కొద్దిగా
1 inch అల్లం
ఉప్పు – కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా చింత పండుని వేడి నీటిలో ఒక పావు గంట పాటు నానా బెట్టిన తర్వాత అందులోని పులుసుని తీసేయండి. తర్వాత బియ్యాన్ని కడిగి కప్ కి రెండు కప్పుల నీళ్ళు పోసి పొడి పొడిగా కుక్ చేసుకోండి.తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, ఎండు మిరప కాయలు, సాయి మినపప్పు, పసుపు, కరివేపాకు,అల్లం ముక్కలు, ఇంగువ, పచ్చి మిర్చి వేసి వేపండి.తరువాత చింతపండు రసం పోయండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసి నిదానంగా ఉడికించండి.పులుసులో కొద్దిగా బెల్లం వేసుకుంటే రుచి బాగుంటుంది. ఒక ఉడుకు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ చింత పండు పులుసుని అన్నం లే వేసి బాగా కలుపుకోండి. తరువాత ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె పోసి అందులో వేరుశెనగ గుళ్ళు వేసి బాగా వేపుకుని  తరువాత వీటిని పులిహార అన్నంలో వేయండి  అంతే ఘుమ ఘుమలాడే చింతపండు పులిహార రెడీ అయినట్లే.పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఈ పులిహార. ఒకసారి మీరు కూడా  ట్రై చేసి చూడండి.
మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: