లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

Vamsi
ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనప్పటికీ క్రమేపి కోలుకుని లాభాలతో ముగిశాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 113 పాయింట్లు లాభపడి 34,305 పాయింట్ల వద్ద, నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 10,528 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. గ్రాసిమ్, యూపీఎల్, సిప్లా, హీరో మోటార్స్, ఎన్టీపీసీ సంస్థల షేర్లు లాభపడ్డాయి.   

వరుసగా ఎనిమిది సెషన్‌ దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ప్రారంభంలో ప్రతికూలంగా ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు, చివరికి పుంజుకున్నాయి.  నేటి ట్రేడింగ్‌లో సిప్లా, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, యూపీఎల్‌ 5 శాతం వరకు ర్యాలీ జరిపాయి. టాటా మోటార్స్‌ సుమారు 5 శాతం వరకు నష్టపోయింది.

ఇక టాటా మోటార్స్ షేర్లు భారీగా నష్టపోగా, విప్రో, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టైటాన్ సంస్థల షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా, వరుసగా ఎనిమిదో రోజూ దేశీయ మార్కెట్లు లాభాలు దక్కించుకున్నాయి. మదుపర్ల కొనుగోళ్ల అండ, ద్రవ్యోల్బణ గణాంకాలు దోహదపడటంతో స్టార్ మార్కెట్లు లాభాలు మూటగట్టుకున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: