బంపరాఫర్..రూ.99కే హైదరాబాద్‌-బెంగళూరు ప్రయాణం

Suma Kallamadi
హైదరాబాద్‌కు నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. అలాగే ఏదైనా పండగలు వస్తే చాలు భాగ్యనగరంలోని ప్రజలు తమ తమ ఊర్లకు క్యూ కడుతుంటారు. ముఖ్యంగా చూస్తే హైదరాబాద్, బెంగళూరు నగరాలు అనేవి సౌత్ ఇండియాలోనే టాప్ సిటీలుగా ఉన్నాయి. ఈ రెండు నగరాల్లో అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి. రెండు మెట్రో నగరాల మధ్య చూస్తే నిత్యం వేలాది సంఖ్యలో ప్రయాణాలు సాగించేవారు ఉన్నారు. ఈ తరుణంలో రెండు నగరాల మధ్య ప్రయాణం చేసేవారికి ఓ శుభవార్త. ఇప్పుడు రూ.99కే హైదరాబాద్, బెంగళూరు మధ్య ప్రయాణం చేయొచ్చు.
రెండు మెట్రో నగరాల మధ్య రూ.99లకే ప్రయాణించే వెసులుబాటును ఫిక్స్‌బస్ కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఛార్జీల విషయానికి వస్తే ఫిక్స్ బస్‌లో తక్కువగానే ఉంటాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్‌గా ఫిక్స్ బస్‌ సంస్థకు దక్షిణాది రాష్ట్రాల్లో మంచి పేరుంది. పైగా ఇప్పుడిప్పుడే ఫిక్స్ బస్ సంస్థ పుంజుకుంటూ ముందుకు సాగుతోంది. బెంగుళూరు నుంచి హైదరాబాద్, బెంగుళూరు నుంచి చెన్నై మార్గాల్లో ఈ సంస్థకు చెందిన బస్సులను కర్ణాటక వాణిజ్య, పరిశ్రమలు, మౌలిక వసతుల మంత్రి ఎంబీ పాటిల్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్లోబల్ ఫ్లిక్స్ సీఓఓ మ్యాక్స్ జుమేర్, సహ వ్యవస్థాపకులు డేనియల్ క్రాస్ వంటివారు కూడా పాల్గొన్నారు.
బెంగుళూరు నగరం నుంచి సుమార్ 33 నగరాలకు తమ బస్‌ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ఫిక్స్ బస్ వెల్లడించింది. తమ సంస్థ నుంచి కొత్త బస్సులను వాడుకలోకి తీసుకు వస్తున్న తరుణంలో రూ.99తో టికెట్‌ బుక్‌ చేసుకునే ఆఫర్‌ను ఫిక్స్ బస్ సంస్థ ప్రకటించడం విశేషం. సెప్టెంబర్ నెలలో 3వ తేది నుంచి 15వ తేది వరకూ మధ్యలో ఈ ధరకు టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రకటనలో తెలిపింది. ప్రయాణ తేదీలు సెప్టెంబరు 11వ తేది నుంచి అక్టోబరు 6వ తేది మధ్య ఉండాలని వెల్లడించింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: