రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం..?

Suma Kallamadi
గత ఏడాది 2000 రూపాయల బ్యాంకు నోట్లోను డిపాజిట్ చేయడం లేదా మార్చుకునే అవకాశం ఆర్బిఐ కల్పించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ క్రమంలో తాజాగా 2000 రూపాయల నోట్ల విషయానికి సంబంధించి ఆర్బిఐ ఒక కీలక ప్రకటన చేసింది. అది ఏమిటి అంటే.. 2000 ఓట్లను మార్చుకునే సదుపాయం ఆర్బిఐ 19 కార్యాలయలలో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలియజేసింది. ఇప్పటికే ప్రజల వద్ద రూ.7261 కోట్ల విలువైన నోట్లు ఉన్నాయని ఆర్బిఐ తెలిపింది. అయితే., గత ఏడాది ఈ బ్యాంకు నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో చెలామణిలో ఉన్న రూ. 2000 బ్యాంకు నోట్ల మొత్తం విలువ రూ. 3.56 లక్షల కోట్లుగా సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. అయితే ఆగస్టు 30న బ్యాంకు సమయం ముగిసే సమయానికి రూ. 7261 కోట్లకు తగ్గినట్లు సమాచారాం.
అయితే ప్రస్తుతం దేశంలోని ఏ పోస్టాఫీసు నుంచైనా రూ. 2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు ఆర్‌బీఐకి చెందిన ఏదైనా ఇష్యూ కార్యాలయానికి పంపవచ్చని ఆర్బిఐ తెలిపింది. అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగ్‌పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలో రూ. 2000 నోట్లను డిపాజిట్ లేదా మార్పిడి చాల సులువుగా  చేసుకోవచ్చు.
2016 నవంబర్ నెలలో అమలులో ఉన్న నోట్లోను రద్దుచేసి 2000 రూపాయల నోట్లోనూ చాలామందికి తీసుకొని వచ్చింది. అయితే మే 19, 2023 నుంచి నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది.  అనంతరం  2023 అక్టోబర్ 9 నుంచి ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో వ్యక్తులు, సంస్థల నుండి రూ. 2000 బ్యాంక్ నోట్లను వారి బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయడానికి అనుమతి ఇచ్చారు. ఇప్పటికైనా మనలో ఎవరి దగ్గరైనా ₹2,000 నోట్లు ఉంటే విషయం చేసుకోవడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: