ఆ బ్యాంకుకు రూ.2 కోట్లు ఫైన్.. షాకిచ్చిన ఆర్బీఐ
2024 ఆగస్టు 26న జారీ చేసిన ఆర్డర్ ప్రకారంగా యూసీవో బ్యాంకుపై రెండు కోట్ల రూపాయలకు పైనే జరిమానా విధించడం బ్యాంకింగ్ రంగంలో అలజడి రేపుతోంది. ఆ బ్యాంకు రెగ్యులేషన్ యాక్ట్ 1949 సెక్షన్ 26ఏ రూల్స్‌ను పాటించలేదు. అడ్వాన్సులపై వడ్డీరేట్లు, బ్యాంక్ కరెంట్ అకౌంట్స్, డిపాజిట్స్‌పై వడ్డీ రేట్లలో మోసాలు చేయడం వల్ల చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. డిపార్ట్మెంట్ చెప్పిన రూల్స్ పాటించనందుకు ఆ చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకులు అనేవి ప్రజలను సంరక్షించేవిగా ఉండాలని, మోసాలకు పాల్పడకూడదని ఆర్బీఐ తెలిపింది. ప్రజలు నష్టపోకుండా బ్యాంకింగ్ రంగంలో మోసాలు జరగకుండా ప్రత్యేక నిబంధనలను తీసుకొచ్చింది. అయితే యూసీవో బ్యాంకు ఆ నిబంధనలను పాటించలేదు.
ముందుగా బ్యాంకు పర్యవేక్షణపై విచారణ చేశాక యూసీవో బ్యాంకుకు ఆర్బీఐ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత మోసాలు బయటపడటంతో చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. నోటీసులు ఇచ్చిన తర్వాత యూసీవో బ్యాంకుకు పెనాల్టీ వేసినట్లు ఆర్బీఐ ప్రకటించింది. యూసీవో బ్యాంకు రుణాలను బెంచ్ మార్క్ చేయడంలో ఫెయిల్ అయ్యిందని ఆర్బీఐ గుర్తించింది. అందుకే ఆ బ్యాంకుపై పెనాల్టీ వేసినట్లుగా చెప్పుకొచ్చింది. బ్యాంకింగ్ రంగంలో ఇటువంటివి జరగడం మామూలే. అయితే బ్యాంకులు మాత్రం ఆర్బీఐ రూల్స్ పాటించడంలో కొన్ని తప్పులు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకుల్లో ఈ మోసాలు భారీగా జరుగుతున్నాయి. దీంతో ఆ బ్యాంకులను కట్టడి చేసేందుకు ఆర్బీఐ ప్రత్యేక చర్యలు చేపట్టింది.