బైకర్స్‌కు అలర్ట్.. హై మైలేజీ ఇచ్చే స్కూటర్లు ఇవే
యమహా ఫాసినో 125ఫై హైబ్రిడ్ స్కూటర్ లీటర్‌కు 68 కిలోమీటర్ల మైలేజీని ఇస్తోంది. ఇదే ఇప్పుడు మొదటి స్థానంలో ఉందని చెప్పాలి. 99 కేజీల బరువున్న ఈ స్కూటర్ ధర రూ.79,900లు మాత్రమే. హోండా యాక్టివా 6జీ వాహనానికి కూడా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా చెప్పొచ్చు. లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇది ఇస్తుంది. టీవీఎస్ జుపిటర్ 125 స్కూటర్ కూడా మంచి బ్రాండ్‌గా కొనసాగుతోంది. అయితే యాక్టివాకు ఉన్న సేల్స్ దీనికి అస్సలు ఉండవని చెప్పాలి. ఇది లీటరుకు 60 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
సుజుకీ బర్గ్‌మన్ స్ట్రీట్ 125 స్కూటర్ స్టైలిష్ డిజైన్‌తో ఉండటం వల్ల దీనికి చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. అయితే మైలేజీ విషయంలో ఇది కాస్త వెనకబడే ఉంది. లీటరుకు కేవలం పెట్రోల్ పై 50 కిలోమీటర్లు మాత్రమే వెళ్లగలుగుతుంది. ఇకపోతే టీవీఎస్ ఎన్‌టార్క్ 125 వాహనానికి కూడా మంచి డిమాండ్ ఉంది. ఇది స్పోర్టీ లుక్లో ఉంటుంది. లీటర్ పై 50 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.