ఒకే సారి రెండు హిట్లు...సంక్రాంతి లక్కీ హీరోయిన్ గా శృతి హాసన్ ?
ముఖ్యంగా పవన్ కళ్యాణ్తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాతో... హీరోయిన్ శృతిహాసన్ కెరీర్ పూర్తిగా మారిపోయింది. అయితే హీరోయిన్ శృతిహాసన్... సంక్రాంతి పండుగకు ఏదో ఒక సినిమాతో వచ్చి హిట్ అందుకుంటుంది. ఈ నేపథ్యంలోనే 2023 సంవత్సరంలో వీర సింహారెడ్డి సినిమాతో... మంచి హిట్ అందుకుంది హీరోయిన్ శృతిహాసన్. ఈ సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా... ఆయన సరసన శృతిహాసన్ హీరోయిన్గా చేసింది.
100 కోట్లతో ఈ సినిమా తీస్తే... దాదాపు 150 కోట్ల వరకు వచ్చాయి. ఊర మాస్ యాంగిల్ లో వచ్చిన ఈ సినిమా... అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్పులు వేసి... సంక్రాంతి లక్కీ హీరోయిన్గా మారిపోయింది శృతిహాసన్. ఇదే 2023 సంక్రాంతి సందర్భంగా... వాల్తేరు వీరయ్య సినిమాతో సక్సెస్ అందుకుంది హీరోయిన్ శృతిహాసన్.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేయగా హీరోయిన్గా శృతిహాసన్ నటించడం జరిగింది. ఇక.. ఈ సినిమా జనవరి 13 2023 సంవత్సరంలో రిలీజ్ అయ్యి.. దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు రవీంద్ర దర్శకత్వం వహించారు. 140 కోట్లు పెట్టి ఈ సినిమా.. 250 కోట్ల వరకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇలా ఓవరాల్ గా ఈ సినిమా... గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో శృతిహాసన్ కు సంక్రాంతి బాగా అచ్చి వచ్చినట్లు చెబుతూ ఉంటారు.