డాకు మహారాజ్ ట్రైలర్: మాస్ అవతార్‌లో అదరగొట్టిన బాలయ్య.. ఫుల్ మీల్స్!!

praveen
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'డాకు మహారాజ్' చిత్రం జనవరి 12న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా, అమెరికాలోని డాలస్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ ప్రారంభంలో ఒక చిన్నారి "అనగనగా ఒక రాజు ఉండేవాడు, చెడ్డవాళ్లందరూ అతన్ని డాకు అనేవారు. మాకు మాత్రం మహారాజు" అని చెప్పడం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఆ తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాలు, భావోద్వేగపూరిత సీన్లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.
బాలయ్య బాబు సరికొత్త మాస్ అవతారంలో అదరగొట్టాడు. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమనిపిస్తోంది. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. బాలయ్య యాక్షన్ సీక్వెన్స్‌లలో జీవించేశాడు. తమన్ అందించిన సంగీతం ట్రైలర్‌కు మరింత ఊపునిచ్చింది. యాక్షన్, ఎమోషన్ కలగలిపిన కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ నిండి ఉంది. "కింగ్ ఆఫ్ జంగిల్" అంటూ బాలయ్యను చూపించిన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ట్రైలర్‌లో బాలయ్య చెప్పే డైలాగులు పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ప్రతినాయకుడిగా బాబీ డియోల్ తనదైన శైలిలో అదరగొట్టాడు. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయనిపిస్తోంది. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లలోనూ మెరిసింది. శ్రద్ధా శ్రీనాథ్‌కు కూడా సినిమాలో ముఖ్యమైన పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే వీరి ఫేట్ మారిపోతుందని చెప్పుకోవచ్చు.

మొత్తానికి, 'డాకు మహారాజ్' ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. అభిమానులకు ఫుల్ మీల్స్ లా కనిపిస్తున్న ఈ ట్రైలర్ ను మీరు కూడా త్వరగా చూసేయండి. ఈ సినిమా హిట్ అయితే బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్స్ అందుకున్నట్లు అవుతుంది అది భారతీయ సినిమాలో అతి పెద్ద రికార్డు అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: