ఇలాంటి మెసేజెస్ దయచేసి క్లిక్ చేయొద్దని మనవి!

Suma Kallamadi
ప్రపంచమే ఇప్పుడు ఒక స్మార్ట్ కుగ్రామం అయిపోయింది. దాంతో అన్ని రకాల లావాదేవీలు ఫోన్లోనే జరుగుతున్నాయి. తినే తిండి, వేసుకునే బట్ట, ప్రయాణించే వాహనాలన్నీ ఆన్లైన్ వేదికగానే నిర్ణయించబడుతున్నాయి. ఇలా మొత్తంగా నేడు మనిషి జీవన విధానమే పూర్తిగా యాంత్రికం అయిపోయింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక దీన్నే ఆసరాగా తీసుకుని కొంతమంది కేటుగాళ్లు రెచ్చిపోయి మరి ప్రవర్తిస్తున్నారు.
ఆన్లైన్ దొంగలు అనగా.. సైబర్ నేరగాళ్లు గురించి కూడా మనకి తెలుసు. నిత్యం ప్రపంచం నలుమూలల లక్షల సంఖ్యలో ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలోనే ఈ కేటుగాళ్లు ఆన్లైన్ వేదికగా సరికొత్త మోసాలకు తెరలేపుతున్నారు. అందుకే సైబర్ సెక్యూరిటీ వారు కొన్ని సూచనలు చేస్తూ తాజాగా ఓ నివేదిక వెల్లడించారు. అందులో ఎవరన్నా అపరిచిత వ్యక్తులు ఏదైనా మెసేజ్లు మీకు పంపించినట్లయితే వాటిని దయచేసి ఓపెన్ చేయకండి అంటూ సూచనలు చేస్తున్నారు.
నకిలీ వెబ్సైట్లు గురించి మీరు అందరూ వినే ఉంటారు. ఆల్రెడీ ఉన్న అధికారిక వెబ్ సైట్లకు వీరు నకిలీవి సృష్టిస్తూ వినియోగదారులను మధ్య పెట్టె ప్రయత్నం చేస్తారు. ఆయా వెబ్సైట్లో విషయంలో జర జాగ్రత్తగా ఉండాలి అంటూ అధికారులు కోరుతున్నారు. తాజాగా ఆన్లైన్ ఫ్లాట్ ఫార్మ్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ వెబ్సైట్లకు సంబంధించి అనేక రకాల ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఊరిస్తూ.. మెసేజ్లు పంపిస్తున్నారని వెల్లడయింది. కాబట్టి ఏదైనా నకిలీ వెబ్సైట్ నుండి మీకు మెసేజెస్ వచ్చినట్లయితే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సైబర్ బ్యూరో చెప్పుకొచ్చింది.

మీరు ఒకవేళ  ఇటీవల ఎటువంటి ఆర్డర్ చేయకుంటే, మీకు అలాంటి సందేశం వచ్చినట్లయితే అది స్కామ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అలంటి సమయంలో ఆ మిస్సస్స్ కు రిప్లై ఇవ్వకుండా ఉండాలి.అలాగే  అనుమానాస్పద లేదా తెలియని లింక్‌లపై క్లిక్ చేయకుండా ఉండాలి. అంతే కాకుండా  వ్యాకరణం, భాషా లోపాలు లేదా అసాధారణ భాష కూడా స్కామ్‌ అవ్వచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: