బంగారంపై మోదీ సంచలన నిర్ణయం?
అయితే మనం ఎక్కువగా ఎయిర్ పోర్టులో పట్టుబడిన బంగారం. స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు అనే వార్తలు వింటూ ఉంటాం. ఎందుకు దుబాయ్, అరబ్ దేశాల నుంచి బంగారం దొంగచాటుగా తీసుకువస్తారు అంటే… అక్కడ మన దగ్గర కిరాణా షాపుల దగ్గర చిప్స్ ప్యాకెట్లు అమ్మినట్లు అక్కడ బంగారాన్ని అమ్ముతుంటారు. అక్కడ అంత చౌకగా పసిడి దొరుకుతుంది. మన బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం అనే విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే మనం ఎక్కువగా బంగారాన్ని పెరూ దేశం నుంచి దిగుమతి చేసుకుంటాం.
రష్యా నుంచి కొనుగోలు చేసినా.. ఎక్కువ శాతం పెరూ నుంచే ఉంటుంది. ఇప్పుడు పెరూ దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. మన దేశంలోకి ఏదైనా వస్తువు రావాలంటే పన్నులు అధికంగా ఉంటాయి. అక్కడ ఆయా దేశాల్లో కూడా పన్నులను వసూలు చేస్తుంటారు. ఈ భారానంతా ఆయా ప్రభుత్వాలు వినియోగదారులపై వేస్తుంటాయి.
కానీ ప్రస్తుతం బంగారంపై విధించే పన్నులను తగ్గించే విధంగా.. అలాగే పెరూ కూడా తమ దేశంలో బంగారంపై విధించే సుంకం తగ్గేలా ఒప్పందం కుదుర్చుకోనున్నారు. తద్వారా బంగారం రేటు గణనీయంగా తగ్గుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది పసిడి ప్రియులకి శుభవార్తే. కాకపోతే ఈ ప్రయోజనాన్ని మోదీ ప్రజలకు చేరవేస్తారా లేదా అనేది అనుమానంగా మారింది. ఎందుకంటే ముడి చమురును తక్కువగా కొనుగోలు చేసిన సమయంలో ఆ మొత్తాన్ని తగ్గించకుండా వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించి వినియోగదారులపై భారం మోపారు. ఇప్పుడు కూడా అలాంటిదే చేస్తారేమో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.