క్రెడిట్ కార్డ్ : ఈ తప్పులు చేస్తే దారుణంగా నష్టపోతారు!

Purushottham Vinay
క్రెడిట్ కార్డును ఇచ్చే ప్రతి కంపెనీ కూడా ఖచ్చితంగా ATM ద్వారా కూడా ఆ కార్డు నుంచి నగదు తీసుకోవటానికి అనుమతిస్తుంది.అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. క్రెడిట్ కార్డ్ చెల్లింపుపై మీకు ఒక నెల సమయం మాత్రమే ఉంటుంది. అలాగే మరోవైపు నగదుపై.. మీకు చెల్లింపు కోసం సమయం అనేది ఉండదు.అందువల్ల నగదు విత్ డ్రా చేసుకున్న వెంటనే మీపై వడ్డీ భారం అనేది ప్రారంభమవుతుంది. ఈ వడ్డీ నెలకు 2.5 నుంచి 3.5 శాతం దాకా ఉంటుంది. ఇక ఇది మాత్రమే కాదు.. మీరు దీనిపై ఫ్లాట్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది కూడా చెల్లించాల్సి ఉంటుంది.ఇంకా క్రెడిట్ కార్డు తీసుకునేటప్పుడు విదేశాల్లో కూడా ఆ కార్డును వినియోగించుకోవచ్చంటూ ఫైనాన్స్ కంపెనీలు ప్రలోభాలకు గురవుతున్నారు.అయితే.. దీని వెనుక ఉన్న కథ కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే విదేశాల్లో మీ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినందుకు విదేశీ కరెన్సీ లావాదేవీల ఛార్జీలను కూడా వసూలు చేస్తాయి. 


అదే సమయంలో..మారకం రేటులో హెచ్చుతగ్గుల ప్రభావం అనేది వినియోగదారులపై పడుతుంది. ఇక మీరు విదేశాల్లో నగదు ఉపయోగించకూడదనుకుంటే.. క్రెడిట్ కార్డ్‌కు బదులుగా ప్రీపెయిడ్ కార్డ్‌ని ఉపయోగించటం చాలా ఉత్తమం. కాబట్టి విదేశాల్లో క్రెడిట్ కార్డుని వినియోగించకండి.చాలా సార్లు ప్రజలు తమ క్రెడిట్ కార్డులను పూర్తి లిమిట్ దాకా ఉపయోగిస్తుంటారు.ఇక అటువంటి పరిస్థితిలో.. కొన్ని సార్లు క్రెడిట్ కార్డుపై ఉండే క్రెడిట్ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటారు. ఇక మీరు మీ పరిమితి కంటే ఎక్కువ ఖర్చు చేస్తే, దాని కోసం కంపెనీ మీకు ఛార్జీ కూడా విధించడం జరుగుతుంది.అలాగే మరోవైపు వినియోగదారులు క్రెడిట్ పరిమితిలో 30 శాతం కంటే ఎక్కువ గనుక ఉపయోగిస్తే.. అది మీ CIBIL స్కోర్‌పై చెడు ప్రభావాన్నిఎక్కువగా చూపుతుంది.చాలా క్రెడిట్ కార్డ్‌లలో బ్యాలెన్స్ బదిలీ ఎంపిక అందుబాటులో ఉంది.ఈ బ్యాలెన్స్ బదిలీ అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్‌లలో ఒకదాని నుంచి మరొక క్రెడిట్ కార్డ్‌కి బిల్లులను చెల్లించవచ్చు. అయితే ఇక దీని కోసం మీరు కొంత వడ్డీ కూడా చెల్లించాలి. కొన్నిసార్లు బ్యాలెన్స్ బదిలీ అనేది లాభదాయకమైనదే. కానీ ఒక కార్డు బిల్లును మరొక దాని నుంచి చెల్లించే విధంగా అసలు చేయవద్దు. ఆపై రెండవది ఇంకా మూడవది నుంచి నాల్గవదానికి చెల్లింపులు చేయటం వల్ల మీ CIBIL స్కోర్ తీవ్రంగా దెబ్బతింటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: