హెల్త్ ఇన్సూరెన్స్ తో 1 లక్ష వరకు పన్ను ఆదా!

Purushottham Vinay
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021 - 2022) వచ్చేసి కొన్ని రోజుల్లో ముగియనుంది. ఇప్పటికీ పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టని వారు మార్చి 31 వ తేదీ లోగా ఆ ప్రక్రియను ముగించాలి.అయితే, టాక్స్ ఆదా కోసం ప్రతీ ఒక్క పన్ను చెల్లింపుదారుడు ముందుగా సెక్షన్ 80సి నే పరిగణలోకి తీసుకుంటారు. సెక్షన్ 80సి పరిమితి రూ. 1.50 లక్షల వరకు మాత్రమే ఉంటుంది. ఇక ఇలాంటప్పుడు సెక్షన్ 80డి ని పరిగణించవచ్చు.నేటి రోజుల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం.ఫ్యూచర్ లో వచ్చే వైద్య అవసరాలకు ఇది ఆర్థికంగా చేయూతనిస్తుంది. అంటే కుటుంబ సంరక్షణకు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. దీంతో పాటు టాక్స్ కూడా ఆదా చేసుకోవచ్చు. సెక్షన్ 80డి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులకు సంబంధించిన అన్ని పరిమితులు, నిబంధనలకు లోబడి పన్ను మినహాయింపు ఇస్తుంది. రూ. 1 లక్ష వరకు టాక్స్ ఆదా చేసుకోవచ్చు. అయితే, పన్ను పరిమితి పన్ను చెల్లింపుదారుడి వయసు ఇంకా అతను ఎవరి కోసమైతే హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేశారో.. ఆ వ్యక్తుల వయసుపై ఆధారపడి ఉంటుంది.


వ్యక్తిగత ప్లాన్‌లు, మెడిక్లెయిమ్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్, క్రిటికల్ ఇల్‌నెస్‌ ప్లాన్లు, జీవిత బీమా ప్లాన్‌ల హెల్త్ రైడర్లు ఇంకా అలాగే ఇతర ఆరోగ్య బీమా వేరియంట్లు.. ఇలా ఆరోగ్య బీమా అందించే అన్ని ప్లాన్ల ప్రీమియం చెల్లింపులపై ఆదాయపు పన్ను చట్టం 1961ఇంకా అలాగే సెక్షన్ 80డి కింద పన్ను ఆదా చేసుకోవచ్చు. అలాగే 'హెల్త్ చెక్ అప్' ఖర్చులపై కూడా సెక్షన్ 80డి కింద రూ. 5 వేల దాకా మినహాయింపుని క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, మెడికల్ చెక్ అప్ అనేది వ్యక్తిగత ప్రీమియం మినహాయింపులో భాగమే.అది వ్యక్తి వయసుపై ఈ లిమిట్ ఆధారపడి ఉంటుంది. 60 సంవత్సరాల లోపు వ్యక్తుల కోసం చెల్లించే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుపై రూ. 25 వేల వరకు, 60 సంవత్సరాలు పైబడిన వారికి రూ. 50 వేల వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.ఒకవేళ 60 సంవత్సరాలు లోపు వయసు గల వారు తమ పేరున, అలాగే 60 ఏళ్లు దాటిన తమ తల్లిదండ్రుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే, ప్రీమియం చెల్లింపుపై రూ. 75 వేల వరకు పన్ను మినహాయింపుని పొందవచ్చు. అదే పన్ను చెల్లింపుదారుడు ఇంకా అతని/ ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ సినియర్ సిటిజన్లు అయితే బీమా ప్రీమియం చెల్లింపులపై రూ. 1 లక్ష వరకు టాక్స్ ని ఆదా చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: