మీ భార్య పేరిట ఖాతా తెరిచి.. ప్రతి నెల రూ.44,793 సొంతం చేసుకోండి?

praveen
సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తి తన కుటుంబానికి ఏ కష్టం రాకుండా చూడాలి అనుకుంటాడు. దీని కోసం అహర్నిశలు శ్రమిస్తూ డబ్బు సంపాదిస్తాడు. అయితే అతను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఓకే కానీ ఒకవేళ దురదృష్టవశాత్తు చనిపోతే ఆ ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటుంది. ముఖ్యంగా కరోనా  సమయంలో  ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా చెప్పలేని పరిస్థితి. మీరు లేనప్పుడు కుటుంబం ఆర్థిక సమస్యలను ఎదుర్కో కూడదు అనుకునే వారికి భరోసా ఇచ్చేందుకు వారికి రెగ్యులర్ ఆదాయానికి క్రియేట్ చేయడం ఎంతో ముఖ్యం.

దీనికోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే చాలు మీరు లేకపోయినప్పటికీ భార్య పిల్లలకు మాత్రం ఆర్థిక భద్రత ఉంటుంది. అయితే భార్య పేరు మీద నేషనల్ పెన్షన్ స్కీమ్ లో కొత్త అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఇంకా ప్రతినెల వారికి పెన్షన్ రూపంలో సక్రమమైన ఆదాయం అందుతుంది. ఇక మీ భార్యకు ప్రతి నెల ఎంత పెన్షన్ పొందాలి అనే విషయం కూడా మీరే నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా డబ్బు కోసం బాధ పడకుండా ఉంటుంది అని చెప్పాలి.

 నేషనల్ పెన్షన్ స్కీమ్ లో భాగంగా ప్రతి నెల లేదా సంవత్సరానికి డబ్బు జమ చేయవచ్చు. వెయ్యి రూపాయలతో మీ భార్య పేరు మీద ఖాతా తెరిస్తే 60 సంవత్సరాలలో మెచ్యూరిటీ పూర్తి అవుతుంది. కావాలి అనుకుంటే మీ భార్య వయసు 65 సంవత్సరాల వరకు కూడా పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత 45 వేల వరకు నెలవారి ఆదాయం పొందవచ్చు. ఉదాహరణకు మీ భార్యకు 30 ఏళ్లు ఉంటే మీరు మీ భార్య పేరు పై  NPS ఖాతాలో ప్రతి నెలా రూ. 5000 పెట్టుబడి పెడుతూ వెళ్లాలి.  పెట్టుబడిపై ప్రతి ఏటా 10 శాతం రాబడి వస్తే 60 ఏళ్ల వయసులో మీ భార్య  ఖాతాలో మొత్తం రూ.1.12 కోట్లు ఉంటాయి. ఇందులో దాదాపు 45 లక్షల రూపాయలు వారు అందుకుంటారు. ఇది కాకుండా వారు ప్రతి నెలా దాదాపు రూ.45,000 పింఛను కూడా పొందుతారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వారు జీవించినంత కాలం ఈ పెన్షన్ పొందుతూనే ఉంటారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: