మనీ మాఫియాకు కేరాఫ్ ఏటీఎం!
రాజకీయం చేస్తారు
బ్యాంకులు ఓపెన్ చేస్తారు
వాటి పేరిట మాఫియా చేస్తారు
డబ్బులుంటే ఏం చేస్తారు
ఏటీఎంల నుంచి విత్ డ్రా చేస్తారు
నాలుగు ఫేక్ అకౌంట్ల నుంచి
మనీ గుంజుకుంటారు
అవసరం అయిన చోటు
కాని చోటు అన్నవి లేకుండా
తమ బలం నిరూపిస్తారు
డబ్బుల్లేకపోతే
ఛ ఆ సమస్యే లేదు
సైబర్ క్రైం చేస్తారు
నోట్లు గుంజుకుంటారు
అడ్డదారిలో..
డబ్బులుంటే డబ్బుల్లేకపోతే
ఇన్ని పాట్లు
ఏటీఎంలో నోట్లు
బయట నోట్లు
ఏం చేస్తాయి
లేకపోతే ఆర్ బీ ఐ ఏం చేస్తుంది
ఇదీ ఇవాళ్టి డిస్కషన్ పాయింట్
డబ్బుల్లేక పోతే ఏటీఎంలలో చాలినంత నగదు ఉంచకపోతే ఫైన్ వేస్తామని పాపం ఆర్బీఐ బ్యాంకులకు హుకుం జారీ చేసింది. కానీ వాస్తవానికి ఉంచాల్సినంత డబ్బు ఉండాల్సినంత డబ్బు ఏటీఎంలలో ఉంటుందా లేకా అ దేమయినా పక్కదారుల్లో పోతుందా?బ్యాంకులన్నీ ఆర్థిక నేరాలు తెలిసే చేస్తున్నాయా లేదా తెలియక బోల్తా పడుతున్నాయి. నిర్ణీత వ్యవధిలో నిర్థారిత రుసుము ఏటీఎంలలో లోడ్ అవుతున్నప్పుడు అవి ఏ క్రమంలో ప క్కదోవ పడుతున్నాయన్న ఆలోచన ఉందా? అన్ని వేళల్లో కాకపోయినా ప్రత్యేక సందర్భాల్లో అయినా నిఘా ఏమయినా ఉందా?
ఏటీఎంలలో ఇప్పటికీ సరయిన నియంత్రిత వ్యవస్థ లేదు.కొన్ని చోట్ల ఇవే మోసాలకు కారణం అవుతున్నాయి. చాలా సందర్భా ల్లో దొంగనోట్ల చెలామణికి ఇవే కేంద్ర స్థానం అవుతున్నాయి. బ్యాంకులు ఏటీఎం నిర్వహణపై బాధ్యతగా లేవు.ఏమయినా లోపాలు చెబితే అక్కడ స్థానిక సిబ్బందికి ఏక కాలంలో చిరాకు,కోపం వస్తాయి.అలాంటప్పుడు బ్యాంకులను ఆర్బీఐ దార్లోకి తీసుకురాగలదా? ప్రభుత్వం నడిపే బ్యాంకులు, ప్రయివేటు సంస్థలు నడిపే బ్యాంకులు, కార్పొరేట్ శక్తులు నడిపే బ్యాంకులు, ఎస్బీఐ కు అనుబంధంగా ఉండే గ్రామీణ వికాస్ బ్యాంకులు ఇలా అన్నీ కూడా తమకు తోచిన విధంగా ఛార్జీలు పిండుతున్నాయే కానీ సేవలు ఇవ్వడం లేదు.ఈ సం దర్భంలో ఆర్బీఐ ఏనాడయినా స్పందించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు జరీమానాలు బ్యాంకులకు విధిస్తాం అని చెప్పడమే ఓ పెద్ద జోక్ .. కాస్త నవ్వుండ్రి లేదా అడ్డదారులలో తరలిపోతున్న డబ్బును పట్టుకోండ్రి
మనీ లీడ్స్ మాఫియా.. నౌ అండ్ దెన్ ఆల్సో