ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురు..!

Satvika
ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు తీపికబురును అందించింది.. గతం లో ఉన్న వాటికన్నా కూడా సరికొత్త  సర్వీసులను అందుబాటు లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఈ కొత్త సర్వీసుల తో కస్టమర్ల aకు మరింత బెనిఫిట్స్ ఉంటాయని అంటున్నారు. డిజిటల్ వాలెట్ పాకెట్స్‌కు యూపీఐ ఐడీని అనుసంధానం చేసుకునే వెసులుబాటు కల్పించింది. కొత్త యూజర్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌కు కస్టమర్లకు కాని వారు కూడా ఇక క్షణాల్లో యూపీఐ ఐడీని పొందొచ్చు. ఇలా చేయడం వల్ల సెక్యురీ‌టిని కూడా వుంటుందని అంటున్నారు..

ఇది పాకెట్స్ యాప్‌ తో ఆటోమేటిక్‌ గా లింక్ అవుతుంది. ఇప్పటికే యూపీఐ ఐడీ కలిగిన కస్టమర్లు పాకెట్స్ యాప్‌ లోకి లాగిన్ అయితే వారికి కొత్త యూపీఐ ఐడీలు కూడా వస్తాయని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఐసీఐసీఐ బ్యాంక్ తాజా నిర్ణయం తో కస్టమర్లు ప్రతి రోజూ చిన్న చిన్న లావా దేవీల ను సులభం గా నిర్వహించుకోవచ్చు. ఈ బ్యాంక్ తీసుకొచ్చిన సేవలు మాత్రం ఇప్పుడు అందరికి మంచి బెనిఫిట్స్ ఉంటాయ ని మార్కెట్ నిపుణులు అంటున్నారు..

ఇకపోతే ఐసీఐసీఐ బ్యాంక్‌‌ లో సేవింగ్స్ ఖాతా లేని వారు కూడా పాకెట్స్ యాప్ ద్వారా సర్వీసులు పొందొచ్చు. దీని వల్ల కాలేజ్ స్టూడెంట్స్‌ కు కొత్త సర్వీసుల వల్ల బెనిఫిట్ కలుగనుంది .నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తో ఐసీఐసీఐ బ్యాంక్ జత కట్టింది. దీంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ కు చెందిన పాకెట్స్ యాప్‌ను యూపీఐ నెట్‌వర్క్‌ తో అనుసంధానించారు. దీంతో పాకెట్స్ యాప్ నుంచి డైరెక్ట్ గా డబ్బులను తీసుకోవ‌చ్చు. ఈ బ్యాంక్ సేవలు అందరికి మంచి ఫలితాల ను అందిస్తున్నారు.. గతంలో కూడా ఎన్నో సేవలను అందించింది.. ఈ బ్యాంక్ తో పాటు గా మరి కొన్ని బ్యాంకులు కూడా సరికొత్త సర్వీసులను అందుబాటు లోకి తీసుకొస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: