వరల్డ్ కప్ కి ముందు.. రోహిత్ ను చూసి భయపడుతున్న ఫ్యాన్స్?

praveen
వరల్డ్ క్రికెట్లో అగ్రశ్రేణి టీమ్స్ లో ఒకటిగా కొనసాగుతున్న టీమిండియా గత కొంతకాలం నుంచి ప్రపంచ కప్ టోర్నీలలో మాత్రం వెనకబడిపోతుంది. అయితే లీగ్ దశలో మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నప్పటికీ నాకౌట్ దశలో మాత్రం ఆ జట్టు ఎందుకో ఆకట్టుకునే ప్రదర్శన మాత్రం చేయలేక పోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే గత కొన్ని నెలల నుంచి భారత జట్టుకు ఐసీసీ టైటిల్ గెలవడం అనేది కేవలం అందని ద్రాక్ష లాగే మారిపోయింది.

 మరీ ముఖ్యంగా గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అయితే పరిస్థితి మరింత దారుణం అని చెప్పాలి. ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా దూసుకుపోయిన ఇండియా.. లీగ్ దశలో తమ చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో భారత క్రికెట్ ఫ్యాన్స్ అందరు కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పాలి. జూన్ నెలలో వెస్టిండీస్ యూఎస్ వేదికలుగా జరగబోయే టి20 వరల్డ్ కప్ లో మాత్రం టైటిల్ విజేతగా నిలవడమే లక్ష్యంగా పెట్టుకుంది టీమిండియా  ఇప్పటికే బీసీసీఐ వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను కూడా ప్రకటించింది అని చెప్పాలి.

 అయితే పొట్టి ప్రపంచకప్ ముంగిట భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ అభిమానులు అందరిని కూడా కలవరపెడుతుంది  ఐపీఎల్ లో తొలి అర్ధ భాగంలో సెంచరీ సహా భారీగా పరుగులు చేసి ఎంతో దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ.. ఇక సెకండ్ హాఫ్ లో మాత్రం తేలిపోతున్నాడు. ఎప్పుడైతే వరల్డ్ కప్ జట్టు ప్రకటన జరిగిందో అప్పటినుంచి ఇక పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. ఇటీవల కోల్కతాతో జరిగిన మ్యాచ్లో కూడా 24 బంతులు ఆడి 19 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అభిమానులు అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. రోహిత్ ఇలా ఆడితే టి20 వరల్డ్ కప్ గెలిచినట్లే అని కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: