వైసీపీతో పోటీ చేసి ఎన్డీఏ బకరా అయిపోతుందా..??

Suma Kallamadi
రేపు ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ, నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయెన్స్‌ (ఎన్‌డీఏ) మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. 175 అసెంబ్లీ సీట్లు, 25 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో టీడీపీపై భారీ మెజారిటీతో గెలిచిన వైఎస్సార్సీపీ అనేక సంక్షేమ పథకాలను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసి ఇప్పుడు కూడా అధికారంలోకి రావడానికి సిద్ధమయ్యింది.
పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీతో చేతులు కలిపి ఈసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, బీజేపీ మధ్య సయోధ్య కుదర్చడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. ఎన్డీయే కూటమిలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో జనసేనకు 21, బీజేపీకి 10 సీట్లను టీడీపీ బిక్షగా వేసింది.  జనసేనకు 2 లోక్‌సభ సీట్లు, బీజేపీకి ఆరు సీట్లు ఇచ్చి టీడీపీ చేతలు దులుపుకుంది. అయితే ఎన్డీఏ అనవసరంగా టిడిపిలో జాయిన్ అయ్యిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈసారి జగన్ బాగా మెజారిటీతో గెలిస్తే ఎన్డీఏ పరువు పోతుంది. ప్రధానంగా టిడిపి పోటీ చేస్తుంది కానీ ఈ పోటీ అనేది దేశవ్యాప్తంగా ఒక ఎన్‌డీఏ పార్టీ చేసినట్లుగానే ఉంటుంది.
ఎన్‌డీఏ కూటమిగా ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఎన్‌డీఏ చివరికి బకరా అయిపోతుంది. గత 59 నెలల్లో వైసీపీ సర్కార్ ఏపీ రూపురేఖలు మార్చేశారు. అవినీతి, వివక్షకు తావు లేకుండా రూ.2.70 లక్షల కోట్లు రాష్ట్ర ప్రజలకు నేరుగా జగన్ అందజేశారు. ఇంత లబ్ధి పొందిన తర్వాత ఏపీ ప్రజలు తమకు జగన్ తప్ప ఎవరూ అవసరం లేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 2019 మేనిఫెస్టోలో చెప్పిన 99 శాతం హామీలను జగన్ నెరవేర్చి చరిత్ర సృష్టించారు, ప్రభుత్వం కొత్త 2.31 లక్షల జాబ్స్ కూడా అందించిందని తెలియజేశారు అన్ని కోణాల్లోనూ ప్రజలకు అన్ని విధాలుగా తాము హెల్ప్ చేశామని గుండెల మీద చేయి వేసుకొని మరీ చెప్తున్నారు. జగన్ కి మద్దతు తెలిపేందుకు లక్షలాదిమంది ప్రజలు ప్రతి చోటా గుమిగూడుతున్నారు. దాన్ని బట్టి ఆయన గెలుపు ఖాయం అనే సంగతి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: