ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం చేసింది జ‌గ‌నా? బాబా ?

Purushottham Vinay
ఎస్సీ, ఎస్టీల‌కు రాజ‌కీయంగా, సాధికార‌త ప‌రంగా .. న్యాయం జ‌రిగింది జ‌గ‌న్ మోహన్ రెడ్డి హ‌యాంలోనే ఏకంగా.. ఆయా సామాజిక వ‌ర్గాల‌కు.. డిప్యూటీ సీఎం ప‌ద‌వులు ఇచ్చి గౌర‌వించారు జగన్ మోహన్ రెడ్డి. పాల‌న‌లో కూడా వారిని భాగస్వాముల‌ను చేశారు.ఎన్నో పరిస్థితుల్లో ఎస్సీ సామాజిక వర్గం సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ అంతా కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రయత్నిస్తున్నారు కానీ వారి పప్పులు ఏమాత్రం ఉడకవు. నా ఎస్సీలు… నా ఎస్టీలు… నా బీసీలు…నా మైనార్టీలు… అని సీఎం జగన్ మోహన్ రెడ్డి బేధాభిప్రాయం లేకుండా ఎప్పుడూ చెబుతారు.జగన్ మోహన్ రెడ్డి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఇప్పుడు అదే ఎస్సీ…ఎస్టీ… బీసీ… మైనార్టీలు సీఎం జగన్ మోహన్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మొత్తం తన ఐదు సంవత్సరాల పాలనలో ఏకంగా రెండు లక్షల 57 వేల కోట్లతో పేద వర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు పేదల భూములు లాక్కున్నాడే తప్ప వారికి చేసింది ఏమిలేదు.


కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ పేదలకు ఇళ్ల పట్టాలు, ఇల్లులు ఇచ్చారు. అంతే గాక పేదల పిల్లల విద్యకు.. పేద వర్గాల ఆరోగ్య భద్రతకు ఎన్నో చర్యలు తీసుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. దేశంలో ఎవరూ చేయని విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల కంటే….. ఇంకా ఎక్కువ చేస్తామని చంద్రబాబు నాయుడు నేడు దొంగ వాగ్దానాలు చేస్తున్నాడు కానీ అధికారంలో ఉన్నప్పుడు పేద ఎస్సీ, ఎస్టీ ప్రజలకి చేసిందేమి లేదు. పైగా బీజేపీ, పవన్ కళ్యాణ్ తో కలిసి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లని ఎత్తేయ్యాలని చూస్తున్నాడు.పేద ప్రజల అభివృద్ధికి  జగన్ కష్టపడుతుంటే…. రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు అంటున్నాడు.అసలు చేసిన వాగ్దానాలను చంద్రబాబు ఏ రోజైనా నిలబెట్టుకున్నాడా? చంద్రబాబు జీవితమే వెన్నుపోటు జీవితం… 420 చరిత్ర. రాష్ట్రంలో  నూటికి 90 శాతం ఎస్సీ కమ్యూనిటీ వైసీపీ విజయాల్లో భాగమయ్యారు. ఇప్పుడు కూడా అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ ప్రజలకు మంచి చేసేది కేవలం జగనే కానీ బాబు, పవన్, బీజేపీ నేతలు మాత్రం అస్సలు కారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: