ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు ఆదాయం ఇలా వస్తుందా?

Satvika
ప్రతి రోజూ ఉదయం లేవగానే బయట బ్యాగులతో తిరుగుతారు ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ వాళ్ళు.. ఆఫీసులకు,ఇళ్ళల్లో వంట చేసుకోలేని వాళ్ళు ఇలా ఒకటేమిటి ప్రతి ఒక్కరూ కూడా ఆన్ లైన్ లో ఫుడ్ ను ఆర్డర్ చేసుకొని తింటారు.ఏది కావాలన్నా మన గడప దగ్గరకే వచ్చేస్తుంది. ఫుడ్ కూడా ఇంటి తలుపు తడుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అనుకోనివి జరగడమే వింత కదా, ఇప్పుడు ఆ వింత కూడా మనకు బాగా అలవాటైపోయి మామూలు విషయమైపోయింది..

ఇలా ఫుడ్ ను డెలివరీ చేస్తే ఆన్ లైన్ సంస్థలకు ఎటువంటి లాభాలుంటాయి.. ఎలా వాళ్లకు డబ్బులు వస్తాయి ఇలా రక రకాల ప్రశ్నలు వేధిస్తుంటాయి. రెస్టారెంట్లలో సేమ్ రేటుకి దొరికే ఒక వస్తువు, ఆన్ లైన్లో ఆర్డర్ చేసినా అదే ధరకి, ఒక్కోసారి అంతకన్నా తక్కువ ధరకి లభిస్తుంది.డెలివరీచేసే వాళ్ళకి లాభాలు ఎలా వస్తాయనేది ప్రశ్న. ఈ ప్రశ్నకి చాలా మందికి తెలిసిన సమాధానాలు కొన్ని ఉన్నాయి. ముందుగా, రెస్టారెంట్లతో ఈ ఆన్ లైన్ డెలివరీ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. కస్టమర్ డైరెక్టుగా వెళితే ఒక రేటు, ఈ ఆన్ లైన్ వాళ్ళకి మరో రేటు ఉంటుంది. అదొక విధానం.

ఇక మరొక విషయానికొస్తే.. ఆన్ లైన్ యాపుల్లో అనేక అడ్వర్టైజ్ మెంట్లు వస్తుంటాయి. రికమెండెడ్ అని చెప్పి ఏవేవో సైట్ల యాడ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ యాడ్ కి కూడా డబ్బులు వస్తాయి. ఇది రెండవ పద్దతి. ఇక మూడవ పద్దతి రెస్టారెంట్ ఓపెన్ చేయడం. అవును, ఆన్ లైన్ యాపులు ఎక్కడ ఏ రకం ఫుడ్ ఎంత మార్కెట్ అవుతుందో అంచనా వేసుకుని, ఆ స్థలాల్లో రెస్టారెంట్లని ఓపెన్ చేస్తుంది. అవి కస్టమర్లు రావడానికే కాకుండా డెలివరీకి పనిచేస్తాయి. దానివల్ల మరింత లాభం ఉంటుంది. ఇలా మూడు రకాలుగా వారు లాభాలు ఆర్జిస్తారు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కస్టమర్లను ఆకర్షించడానికి ఎన్నో ఆఫర్లను అందిస్తున్నారు. మరో వైపు పెట్రోల్ ధరలు భారీగా పెరిగాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: